Manchu Lakshmi: బాడీ షేమింగ్ ప్రశ్నలు.. క్షమాపణ చెప్పిన జర్నలిస్ట్
ABN, Publish Date - Sep 25 , 2025 | 02:31 PM
‘దక్ష’ (Daksha) చిత్రం ప్రమోషన్‌లో భాగంగా మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu lakshmi) ఓ యూట్యూబ్‌కి ఇంటర్వూ ఇచ్చారు. అందులో యాంకర్ ఆమె వయస్సు, వస్త్రధారణను ఉద్దేశిస్తూ అభ్యంతరకర ప్రశ్న అడగడంతో మంచు లక్ష్మీ ఆగ్రహించి క్షమాపణ కోరింది
‘దక్ష’ (Daksha) చిత్రం ప్రమోషన్‌లో భాగంగా ఆ చిత్రంలో కీలక పాత్ర పోషించిన మంచు లక్ష్మీ ప్రసన్న (Manchu lakshmi) ఓ యూట్యూబ్‌కి ఇంటర్వూ ఇచ్చారు. అందులో యాంకర్ స్థానంలో ఉన్న జర్నలిస్ట్ ఆమె వయస్సు, వస్త్రధారణను ఉద్దేశిస్తూ అభ్యంతరకర ప్రశ్న అడగడంతో మంచు లక్ష్మీ ఆగ్రహించి సదరు జర్నలిస్ట్‌పై తగిన చర్యలు తీసుకోవాలని ఫిల్మ్ ఛాంబర్‌ను(Film CHamber) , మూవీ ఆర్టిస్ట్స్ (MAA)
అసోసియేషన్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ వివాదంలో లక్ష్మీకి అండగా నటి హేమ (Hema) నిలబడ్డారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో కూడా విడుదల చేశారు. అయితే తాజాగా సదరు సీనియర్ జర్నలిస్ట్ మంచు లక్ష్మికి క్షమాపణ తెలిపాడని తెలిసింది.
‘మా’ అసోషియేషన్ ట్రెజరర్ శివబాలాజీ తెలిపిన వివరాల ప్రకారం.. మంచు లక్ష్మీని బాడీ షేమింగ్ ప్రశ్నలు అడిగిన సదరను జర్నలిస్ట్‌తో మా’ అధ్యక్షుడు మంచు విష్ణు స్వయంగా మాట్లాడగా.. అతను తన చర్యలకుగానూ క్షమాపణలు తెలిపినట్లు.. అపాలజీ లేటర్‌ను కూడా ‘మా’కి పంపినట్లు శివబాలాజీ చెప్పారు. ఈ విషయాన్ని మంచు లక్ష్మికి తాము తెలియజేశామని చెప్పారు. ఈ వివాదంలో ‘మా’ ఏ ఒక్కరి పక్షాన నిలవకుండా వివాదాన్ని పరిష్కరించింది అన్నటు శివబాలాజీ చెబుతున్నారు.