సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: ఒకే థీమ్... రెండు సినిమాలు... ఒకే రోజు విడుదల...

ABN, Publish Date - Oct 29 , 2025 | 04:16 PM

నవంబర్ 14న రెండు గోవా రోడ్ ట్రిప్ మూవీస్ విడుదల కాబోతున్నాయి. అందులో ఒకటి జిగ్రీస్ కాగా మరొకటి గోపీ గాళ్ళ గోవా ట్రిప్.

Gopi Galla Goa Trip - Jigris Movies

నవంబర్ 14 బాలల దినోత్సవం (Childrens day). చిత్రం ఏమంటే... ఆ రోజున తెలుగులో డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ పది వరకూ విడుదల అవుతున్నాయి. అందులో ఒకటి రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన 'శివ' (Shiva) సినిమా. దీనిని భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేయడానికి వర్మ పథక రచన చేస్తున్నారు.

ఇక ఆ రోజున దల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన 'కాంత' (Kantha) విడుదల కాబోతోంది. అలానే 'సంతాన ప్రాప్తిరస్తు, అభినవ్, బ్రాట్, సీత ప్రయాణం కృష్ణతో' మూవీస్ తో పాటు కన్నడ డబ్బింగ్ సినిమాలు 'లవ్ ఓటీపీ, గత వైభవ' వస్తున్నాయి. ఈ సినిమాలన్నీ ఒక ఎత్తు కాగా, దాదాపు ఒకే కాన్సెప్ట్ లో రూపుదిద్దుకున్న రోడ్ ట్రావెల్ మూవీస్ రెండు బాలల దినోత్సవం నాడు జనం ముందుకు వస్తున్నాయి. ఆ రోడ్ ట్రిప్ ఎక్కడికో కాదు... గోవాకు!


అజిత్ మోహన్, రాజు శివరాత్రి, క్యాంప్ శశి, సాయి కుమార్, పవోన్ రమేష్, మోనిక బుసం ప్రధాన పాత్రలు పోషించిన సినిమా 'గోపి గాళ్ళ గోవా ట్రిప్' (Gopi Galla Goa Trip). సాయి కుమార్ సీతారామరాజు, రమణా రెడ్డి నిర్మించిన ఈ సినిమాను రోహిత్ అండ్ శశి డైరెక్ట్ చేశారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. షార్ట్ ఫిల్మ్ తీసి పేరు తెచ్చుకున్న రోహిత్, శశి కి ఇది మూడో సినిమా. ఈ రోడ్ ట్రావెల్ ఫిల్మ్ తెలుగు ఆడియెన్స్ కు కొత్త అనుభూతిని కలిగిస్తుందని వాళ్ళు చెబుతున్నారు. ఇందులో జగదీశ్‌ భండారి మేనల్లుడు కూడా నటించాడు.

చిత్రం ఏమంటే... 'గోపీ గాళ్ళ గోవా ట్రిప్' మూవీ విడుదల కాబోతున్న నవంబర్ 14నే గోవా ట్రిప్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న మరో సినిమా 'జిగ్రీస్' (Jigris) కూడా వస్తోంది. 'మ్యాడ్' (Mad) చిత్రంలో వన్ ఆఫ్‌ ద హీరోస్ గా ఉన్న రామ్ నితిన్ ఇందులోనూ కీలక పాత్ర పోషించాడు. కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. హరీశ్‌ రెడ్డి ఉప్పుల డైరెక్ట్ చేసిన ఈ సినిమాను కృష్ణ ఓడపల్లి నిర్మించారు. ఈ క్రేజీ అడ్వంచరస్, హిలేరియస్ రోడ్ ట్రిప్ మూవీ కూడా గోవా వైపే సాగింది. మరి ఒకే రోజున రాబోతున్న ఈ రెండు గోవా ట్రిప్ మూవీస్ లో ఏది ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.

Also Read: Malavika Mohanan: చిరుతో రొమాన్స్.. మాళవిక రియాక్షన్ ఇదే

Also Read: Nithiin : రెండు సినిమాలు వదిలేసి... డ్యుయల్ రోల్ వైపు మొగ్గు...

Updated Date - Oct 29 , 2025 | 04:18 PM