Jayammu Nichayammu Raa: నా వోడ్కా ఎక్కడ.. జగపతిబాబును ఆడేసుకున్న ఆర్జీవీ
ABN, Publish Date - Sep 01 , 2025 | 05:41 PM
విలక్షణ నటుడు జగపతి బాబు(Jagapathi Babu) జయమ్ము నిశ్చయమ్మురా(Jayammu Nichayammu Raa) షోతో హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే.
Jayammu Nichayammu Raa: విలక్షణ నటుడు జగపతి బాబు(Jagapathi Babu) జయమ్ము నిశ్చయమ్మురా(Jayammu Nichayammu Raa) షోతో హోస్ట్ గా మారిన విషయం తెల్సిందే. ఏది మనసులో దాచుకొని జగపతి బాబు.. ఈ షోలో వచ్చిన గెస్ట్ లను కూడా తన ప్రశ్నలతో ఇబ్బందిపెట్టేస్తున్నాడు. ఇప్పటికే మూడు ఎపిసోడ్స్ ఎంతో విజయవంతంగా పూర్తిచేసుకుంది జయమ్ము నిశ్చయమ్మురా. మొదటి గెస్ట్ గా నాగార్జున (Nagarjuna), రెండో గెస్ట్ గా శ్రీలీల(Sreeleela).. మూడో గెస్ట్ గా నాని(Nani) వచ్చి సందడి చేశారు. ఇక నాలుగో ఎపిసోడ్ కు జగపతి బాబు.. ఒక డెవిల్ ను ఒక యానిమల్ ను కలిసి ఆహ్వానించాడు. వారే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma), సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanaga).
ఆర్జీవీ, సందీప్ కు సంబంధించిన ప్రోమో రిలీజ్ అయ్యి సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మొదటిసారి వర్మ.. జగపతి షోలో డ్యాన్స్ వేశాడు. బోటనీ పాఠముంది సాంగ్ కు చిందులు వేసి షాక్ ఇచ్చాడు. ఇక అందరినీ జగపతి ఆడుకుంటే.. ఆయనను వర్మ ఆడేసుకున్నాడు. ఇక వర్మకు తోడుగా మరో డైరెక్టర్ సందీప్ రెడ్డిని పిలిచిన జగపతి ఆయనకు వెళ్లే ముందు వోడ్కా బాటిల్ ఇవ్వడం దానికి వర్మ.. నాకెందుకు ఇవ్వలేదు వోడ్కా.. సందీప్ సూపర్ డైరెక్టర్ నేను కాదు అనా అని బాంబ్ లు పేల్చాడు.
ఇక ఈ ప్రోమో అంతా సరదాసరదాగా కట్ చేశారు. జగపతి.. ఇద్దరినీ ప్రశ్నలు అడగడం.. వర్మ రివర్స్ లో సమాధానాలు చెప్పడం ఆకట్టుకుంటుంది. గర్ల్ ఫ్రెండ్స్ సంగతి ఏంటి అంటే.. మమ్మల్ని మేము ప్రేమించుకోవడానికే టైమ్ లేదన్నప్పుడు.. వేరేవారి గురించి ఏం ఆలోచిస్తామని వర్మ సెటైర్ వేశాడు. ఇక సార్ మనిద్దరం క్లాస్మేట్స్ అయితే ఎలా ఉండేది అని సందీప్ అనగా.. ఒకరు అమ్మాయి అయితే బావుండేది అని వర్మ జోక్ వేశాడు. ఒక డెవిల్, ఒక యానిమల్ కలిసి కూర్చొని మూసి మూసి నవ్వులు నవ్వుతుంటే బావుందని జగపతి బాబు చెప్పడం అదిరిపోయింది. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది.
August Tollywood Report: షరా మామూలే...
Ustaad Bhagat Singh: ఫుల్ మీల్స్ పెట్టిన హరీష్ శంకర్.. ఏమున్నాడ్రా బాబు