Ustaad Bhagat Singh: ఫుల్ మీల్స్ పెట్టిన హరీష్ శంకర్.. ఏమున్నాడ్రా బాబు

ABN , Publish Date - Sep 01 , 2025 | 05:03 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు వేడుకలు ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) తో మొదలయ్యాయి.

Uastaad Bhagat Singh

Ustaad Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు వేడుకలు ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) తో మొదలయ్యాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా నుంచి హరీష్ శంకర్ (Harish Shankar) ఫుల్ మీల్స్ పెడతాడా అని ఎదురుచూసిన ఫ్యాన్స్ కు కడుపునిండిపోయేలా భోజనం పెట్టేశాడు. మునుపెన్నడూ చూడని పవన్ ను అభిమానులకు చూపించాడు. రేపు అనగా సెప్టెంబర్ 2.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అన్న విషయం అందరికీ తెల్సిందే. ఇక పవన్ రాజకీయాల్లోకి వచ్చాకా.. సినిమాపరంగా పోస్టర్లు, అప్డేట్స్ తో ఈ ఏడాది మాత్రమే కళకళలాడుతోంది.


హరిహర వీరమల్లు తరువాత పవన్ నటిస్తున్న చిత్రాల్లో ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి. గబ్బర్ సింగ్ తరువాత హరీష్ శంకర్ - పవన్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అభిమానులు భారీ అంచనాలనే పెట్టుకున్నారు. రీమేక్ అయినా కూడా హరీష్ ఏదో విధంగా పవన్ ను సరికొత్తగా చూపించబోతున్నాడు అని ఎప్పటినుంచో అభిమానులు ఆశతో ఉన్నారు. ఇక ఈరోజు పవన్ బర్త్ డే పోస్టర్ తో ఆ ఆశ తీరిపోయింది.


మోడ్రన్ మైకేల్ జాక్సన్ లా నిలబడిన పవన్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అప్పుడెప్పుడో మేడ్ ఇన్ ఆంధ్రా స్టూడెంట్ సాంగ్ లో పవన్ ను ఈ రేంజ్ లుక్ లో చూసారు. ఆ తరువాత పంజాలో కనిపించినా.. దాన్ని సీరియస్ లుక్ డామినేట్ చేసింది. ఇక ఉస్తాద్ లో మాత్రం ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ అని చెప్పడంలో ఆశ్చర్యం లేదని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. ఇక ఈ స్టిల్ ఉస్తాద్ లోని ఒక సాంగ్ లోనిదిలా కనిపిస్తుంది. బ్లాక్ అండ్ బ్లాక్ సూట్.. పైన హ్యాట్.. ఆ స్వాగ్.. వెనుక డ్యాన్సర్లు.. టైమ్.. అన్ని అద్భుతంగా ఉన్నాయి. పవన్ లుక్ ను చూసి అభిమానులు ఏమున్నాడ్రా బాబు.. ఈ సాంగ్ కు థియేటర్ లో ఫ్యాన్స్ కు పూనకాలే అని కామెంట్స్ చేస్తున్నారు. చెప్పినట్లుగానే హరీష్ అన్నా ఫుల్ మీల్స్ పెట్టాడురా అని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఈ సినిమాతో పవన్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Updated Date - Sep 01 , 2025 | 05:08 PM