Janhvi Kapoor: జాన్వీకి డూప్‌గా మరో హీరోయిన్
ABN, Publish Date - Nov 26 , 2025 | 04:31 PM
హీరోలకు డూప్ లు ఉంటారని తెలుసు. హీరోయిన్లకూ డూప్ లు ఉంటారని తెలుసు. కామన్ గా ఆ డూప్స్ బిగ్ స్క్రీన్ పై కనిపించని వారై ఉంటారు. కానీ ఆ స్టార్ హీరోయిన్ కోసం డూప్ గా మరో హీరోయిన్ చేస్తోందన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఎవరా బ్యూటీ... ఏమా కథ.. లెట్స్ సీ...
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది'. ఈ మూవీపై ప్రస్తుతం భారీ హైప్ క్రియేట్ అయ్యింది. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక ఈ మూవీలో జాన్వీ ‘అచ్చియమ్మ’ అనే విలేజ్ బ్యూటీగా కనిపించనుంది. ఇటీవల విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్‌లో ఆమె లుక్స్, డాన్స్ ఆడియెన్స్‌ను ఫిదా చేసేశాయి. ఇది 'దేవర' తర్వాత జాన్వీ చేస్తున్న సెకండ్ క్రేజీ తెలుగు ప్రాజెక్ట్ కాగా.. ఈ సినిమాతో ఈ సొగసరి ఇమేజ్ సౌత్ లో ఖచ్చితంగా పెరుగుతుందనే ప్రచారం బాగా సాగుతోంది. ఇదే సమయంలో మూవీ సెట్స్ నుండి బయటకు వచ్చిన ఇంట్రెస్టింగ్ గాసిప్ విపరీతంగా వైరల్ అవుతోంది.
'పెద్ది' సినిమాలో జాన్వీ కి సంబంధించి కొన్ని కీలక సన్నివేశాల్లో డూప్ గా నటించేందుకు 'మసూద’లో ఘోస్ట్ గా నటించిన బాంధవి శ్రీధర్‌ను ఎంపిక చేశారట. ఇద్దరి హైట్, బాడీ లాంగ్వేజ్, ఫేషియల్ ఫీచర్స్ దాదాపు ఒకేలా ఉండటమే ఈ ఎంపికకు ప్రధాన కారణమని టాక్. ముఖ్యంగా వైడ్ యాంగిల్ షాట్స్, బ్యాక్ షాట్స్, రన్నింగ్ సీక్వెన్స్‌లలో బాంధవిని ఉపయోగించే అవకాశం ఉందట. ఇలా చేయడం వల్ల జాన్వీ ముంబయి నుంచి తరచూ హైదరాబాద్, విజయవాడలోని షూటింగ్ లొకేషన్లకు రావాల్సిన అవసరం లేదని తెలుస్తోంది. తద్వారా ప్రయాణపు ఖర్చు, హోటల్ విడిది, ప్రైవేట్ మేకప్ టీమ్ కు అయ్యే ఖర్చు తగ్గుతుందని ప్రొడక్షన్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.
బాంధవి 'మసూద'లో దెయ్యంగా బాగా భయపెట్టింది. ఆ తర్వాత కొన్ని ప్రాజెక్టుల్లో నటించినప్పటికి తగినంత గుర్తింపు మాత్రం రాలేదు. అయితే 'పెద్ది'లో బాంధవి ఓ పాత్ర చేస్తుందనే మాట కూడా వినిపిస్తోంది. కానీ మేకర్స్ ఈ విషయాన్ని తెలియచేయలేదు. అందువల్ల షూటింగ్ స్పాట్ కు వెళ్ళిన వారు ఆమె జాన్వీకి డూప్ గా నటిస్తోందనే భావనకు వచ్చారు. ఏదేమైనా...'పెద్ది' సినిమాలో వర్క్ చేయడం అనేది బాంధవి శ్రీధర్‌కు కలిసొచ్చే విషయమే. ఆ రకంగా ఆమెకు మరిన్ని అవకాశాలు వస్తాయేమో చూడాలి.
Read Also: Prabhas: ఎట్టకేలకు ప్రభాస్ - అనుష్క పెళ్లి ఈ విధంగా జరిగింది
Read Also: NBK111: బాలయ్య.. మహారాజు షురూ! ఫుల్ జోష్‌లో ఫ్యాన్స్