Prabhas: ఎట్టకేలకు ప్రభాస్ - అనుష్క పెళ్లి ఈ విధంగా జరిగింది
ABN , Publish Date - Nov 26 , 2025 | 03:28 PM
ఏంటి.. ప్రభాస్ (Prabhas) - అనుష్క(Anushka) పెళ్లి జరిగిందా.. ? నిజమా.. ? ఇండస్ట్రీ వాళ్ళందరూ వచ్చరా.. ? ఇదెప్పుడు జరిగింది.. ? అని ఆశ్చర్యపోకండి.
Prabhas: ఏంటి.. ప్రభాస్ (Prabhas) - అనుష్క(Anushka) పెళ్లి జరిగిందా.. ? నిజమా.. ? ఇండస్ట్రీ వాళ్ళందరూ వచ్చరా.. ? ఇదెప్పుడు జరిగింది.. ? అని ఆశ్చర్యపోకండి. రియల్ గా జరగనివాటిని రీల్ గా చేసి సంతోషపడడం ఈ మధ్య కామన్ గా మారిపోయింది. ప్రభాస్ - అనుష్క పెళ్లి జరిగింది.. ఆ పెళ్లికి ఇండస్ట్రీ పెద్దలు అందరూ వచ్చారు. కానీ, అది ఏఐ ద్వారా జరిగింది. ఏఐ వచ్చిన దగ్గర నుంచి ఏది రియల్ ఫోటోనో.. ఏది ఏఐ ఫోటోనో చెప్పడం చాలా కష్టంగా మారింది. అసలు ఎవరి ఫోటో అయితే ఏఐ చేశారో.. వారే తమ ఫోటో కాదు అని చెప్పలేని పరిస్థితి. డీప్ ఫేక్ వీడియోలు, మార్ఫింగ్ వీడియోలు అని కాకుండా ఈ ఏఐ ద్వారా నవ్వుకొనేవి, సాధ్యం కానీవి చేస్తే బావుంటుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో అలాంటి ఏఐ ఫోటోలు, వీడియోలు దర్శనమిస్తున్నాయి.
టాలీవుడ్ స్టార్ హీరోలు అందరూ కలిసి ఒకేచోట టీ తాగడం, కుర్ర హీరోలు అందరూ కలిసి ఆటలు ఆడడం.. ఇలాంటి ఫోటోలు చూసినప్పుడు అబ్బా ఎంత బావున్నాయి. ఏఐ వలన అయినా టాలీవుడ్ హీరోలు కలిసి ఉన్నారు అనే ఫీల్ ని తెప్పిస్తుంది. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. కొందరు పెళ్లి కానీ స్టార్స్ కి ఏఐ ద్వారా పెళ్లి కూడా చేసేస్తున్నారు. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్. ఇక అతని పెళ్లి ఎప్పుడు అవుతుంది అనేది అతనికైనా తెలుసా అంటే అది లేదు.
ఇక బిల్లా వచ్చినప్పటి నుంచి ప్రభాస్ - అనుష్క జంటకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇద్దరి హైట్, పర్సనాలిటీ.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉంటారు. ఆ తరువాత మిర్చి, బాహుబలి చూశాక.. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని కోరుకొనేవారే ఎక్కువ. కానీ, తామిద్దరం ఫ్రెండ్స్ మాత్రమే అని వారు ఎప్పుడూ చెప్పుకోస్తూనే ఉంటారు. దీంతో అభిమానులు ఇలా ఏఐ ద్వారా వారికి పెళ్లి చేసేశారు.
తాజాగా ప్రభాస్ - అనుష్క ఏఐ పెళ్లి వీడియొ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. డార్లింగ్ పెళ్లికి ఇండస్ట్రీ మొత్తం వచ్చింది. నాగార్జున, నని సన్నాయి ఊదుతున్నట్లు చూపించారు. ఇక ఎన్టీఆర్, రామ్ చరణ్ వంట చేస్తున్నట్లు.. రవితేజ, బన్నీ డ్యాన్స్ చేస్తున్నట్లు.. బాలయ్య డప్పు కొడుతున్నట్లు క్రియేట్ చేశారు. ప్రభాస్ స్నేహితుడు గోపీచంద్ భోజనాలు వడ్డిస్తుండగా మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఆరగిస్తున్నట్లు చూపించారు. చివరకి ప్రభాస్.. అనుష్క మెడలో తాళి కడుతున్నట్లు చూపించారు.
ఈ చిన్న వీడియో ప్రభాస్ ఫ్యాన్స్ ను మాత్రం తెగ ఆకట్టుకుంది. చేస్తే చేశాడు కానీ ఏఐ ఆ ఊహ ఎంత బావుందో.. చూడడానికి ఈ వీడియొ కన్నుల పండగగా ఉందని చెప్పుకొస్తున్నారు. ప్రభాస్ - అనుష్క పెళ్లి నిజం కాకపోయినా కూడా ఫ్యాన్స్ జంట బావుండాలని కోరుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.