సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Re Release Spl: 'జల్సా, తమ్ముడు'రీరిలీజ్

ABN, Publish Date - Aug 14 , 2025 | 02:22 PM

పవర్ స్టార్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేశాడు. అభిమానులకు మరోసారి పూనకాలు తెప్పించేందుకు సిద్ధమయ్యాడు. రీ-రిలీజ్ ల్లో పాత రికార్డులను బద్దలు కొట్టి .. కొత్త సంచలనాలకు తెర తీసేందుకు కసరత్తు మొదలెట్టాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan) ప్రస్తుతం మంచి ఊపులో ఉన్నాడు. పాలిటికల్ హడావుడి కి కాస్త బ్రేక్ ఇచ్చి సినిమాలపై ఫోకస్ పెట్టాడు. కమిట్ అయిన సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు. ఇప్పటికే 'హరిహరవీరమల్లు' (Hari Hara Veera Mallu) ను రిలీజ్ చేసిన పవన్ కళ్యాణ్ 'ఓజీ' (OG) ని లైన్లో పెట్టాడు. దసరా కానుకగా సెప్టెంబర్ 25న గ్రాండ్ గా రిలీజ్ కు సిద్ధమవుతోంది. అంతేకాక 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh ) కూడా ఫాస్ట్ గా పూర్తి చేసేస్తున్నాడు. ఈ విషయం పక్కన పెడితే 'వీరమల్లు' తో ఫ్యాన్స్ ను కాస్త నిరాశపరిచిన పవన్ ఆ లోటును తీర్చేందుకు డబుల్ ట్రీట్ తో రాబోతున్నాడు.


పవన్ ఫ్యాన్స్ లో కొత్త జోష్ నింపేందుకు రెండు సినిమాలు రీ-రిలీజ్ అవుతున్నాయి. పవన్ కెరీర్ లోనే ది బెస్ట్ మూవీస్ గా నిలిచిన 'జల్సా' (Jalsa), 'తమ్ముడు' (Thammudu ) సినిమాలను రీ-రిలీజ్ చేయనున్నారు. పవన్ కళ్యాణ్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2 న వాటిని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గా మహేశ్ బాబు పుట్టిన రోజు కానుకగా 'అతడు' 4కే వెర్షన్ లో రీ-రిలీజ్ అయింది. ఆ సినిమా కలెక్షన్లు బీట్ చేసేలా పవన్ రెండు సినిమాలు రీ-రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, పవన్ కాంబోలో వచ్చిన 'జల్సా' మూవీ 2008లో బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్ ను సొంతం చేసుకుంది. ఇందులో గురూజీ పంచ్ లు, సంజయ్ సాహు గా పవన్ డైలాగ్స్ తో పాటు… పాటలు కావాల్సినంత కిక్ ఇచ్చాయి. అందుకే ఎన్ని సార్లు థియేటర్లలో సందడి చేసినా అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తూనే ఉంది. దీంతో మరోసారి రీ-రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో వచ్చిన ఈ మూవీ పవన్ బర్త్ డే కానుకగా రీ-రిలీజ్ కు రెడీ అవుతోంది.

ఇక అదే రోజున 1999లో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'తమ్ముడు' మూవీ కూడా రీరిలీజ్ కానుంది. యూత్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ చిత్రం పవర్ స్టార్ కెరీర్ నే మార్చేసింది. పవన్ కామిక్ చేష్టలు, రామణ గోగుల చార్ట్బస్టర్ సౌండ్ట్రాక్ ఈ సినిమాని కల్ట్ క్లాసిక్ గా మార్చాయి. మరి 4కె రిజల్యూషన్లో వస్తున్న ఈరెండు సినిమాలు రీ-రిలీజ్ మూవీస్ లో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయో చూడాలి.

Read Also: Ponnambalam: ల‌క్ష ఇస్తార‌నుకుంటే.. చిరంజీవి కోటి ఇచ్చారు

Read Also: War 2 Review: యన్టీఆర్ తొలి హిందీ చిత్రం వార్ 2 ఎలా ఉందంటే.. ఫుల్ రివ్యూ!

Updated Date - Aug 14 , 2025 | 02:29 PM