Jagapathi Babu: వర్మ..ఆ సినిమాలో నీ ముఖం ఎవడు చూస్తాడన్నాడు

ABN , Publish Date - Sep 03 , 2025 | 07:29 PM

సీనియర్ నటుడు జగపతి బాబు (Jagapathi Babu).. తనదైన మాటతీరుతో జయమ్ము నిశ్చయమ్మురా (Jayammu NichayammuRaa) షోను విజయవంతంగా నడిపిస్తున్నాడు.

Jayammu NichayammuRaa

Jagapathi Babu: సీనియర్ నటుడు జగపతి బాబు (Jagapathi Babu).. తనదైన మాటతీరుతో జయమ్ము నిశ్చయమ్మురా (Jayammu NichayammuRaa) షోను విజయవంతంగా నడిపిస్తున్నాడు. ఇప్పటికీ మూడు ఎపిసోడ్స్ ను ఫినిష్ చేసిన జగపతి.. నాలుగో ఎపిసోడ్ ను చాలా ప్రత్యేకంగా మార్చాడు. ఎప్పుడు.. ఇలాంటి టాక్ షోస్ కు రాని ఇద్దరు డైరెక్టర్స్ ను ఒకే చోట కలిపాడు. వారే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma), సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga). డెవిల్ తో యానిమల్ అంటూ జగపతి వారిద్దరికి పేర్లు కూడా పెట్టేశాడు. ఇక ఈ ఎపిసోడ్ కు సంబంధించి రిలీజ్ అయిన ప్రోమోలు ఎప్పటికప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.


ఇక తాజాగా మరో కొత్త ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక ఇందులో గాయం సినిమా జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు జగపతి. ఆయన కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా నిలిచిన చిత్రం గాయం. ఆర్జీవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో భారీ హిట్ గా నిలిచింది. ఇక ఆ సినిమా సమయంలో జరిగిన సంఘటనలను జగపతి బాబు గుర్తుచేసుకున్నాడు. ' ఇండస్ట్రీలో ఒక సాలిడ్ పేరు రిజిస్టర్ అయ్యింది గాయంతోనే' అని జగపతి బాబు చెప్పగా.. ' నువ్వు నన్ను పొగిడినంత మాత్రానా నేను నిన్ను పొగడను' అని వర్మ తనదైన రీతిలో సెటైర్ వేశాడు.


' ఊర్మిళ ముందు ఉంది.. నేను వెనుక ఉన్నా. రాము నేను ఏం చేయాలి అని అడిగితే.. నీ ముఖం ఎవడు చూస్తాడు. నువ్వేం చేస్తే ఏంటి అన్నాడు' అని జగపతి బాబు అప్పటిరోజులను గుర్తుచేశాడు. ఇక దానికి సమాధానంగా వర్మ.. సందీప్ ను గాయం చూస్తే నువ్వు ఊర్మిళ కోసం చూసావా.. జగపతి కోసం చూసావా అని ప్రశ్నించాడు. ఇక సందీప్ మరింత తెలివిగా మీ కోసం చూసాను సార్ అని చెప్పడంతో మరోసారి నవ్వులు పూశాయి. ఏదేమైనా మీరు నా టీచర్ సార్ అని సందీప్ అనగానే.. సందీప్ లాంటి స్టూడెంట్ నాకు ఉంటే టీచింగ్ మానేస్తాను అని కౌంటర్ వేశాడు వర్మ. అలా వర్మ పంచ్ లతో ప్రోమో అదిరిపోయింది. వచ్చే ఆదివారం ఈ ఎపిసోడ్ జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.

Thursday Tv Movies: Sep 04, గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలివే

Ram Pothineni: 'బాహుబలి' నిర్మాతలతో రామ్

Updated Date - Sep 03 , 2025 | 07:29 PM