Kannappa Event: ఇంతకీ ప్రభాస్ వస్తాడా.. లేదా.. ఫ్యాన్స్ వెయిటింగ్
ABN, Publish Date - Jun 20 , 2025 | 05:24 PM
కన్నప్ప సినిమాలో అందరి చూపు ప్రభాస్ పైనే. ప్రేక్షకులంతా ప్రభాస్ (Prabhas) మీదున్న అభిమానంతోనే ఈ సినిమాకు వస్తారని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు.
'కన్నప్ప' (Kannappa) మంచు విష్ణు (manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్. ఆయన ఎప్పటి నుంచో కంటున్న కల ఇప్పటికి నెరవేరుతుంది. మంచు విష్ణు టైటిల్ పాత్ర పోషిస్తున్న చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్, అక్షయ్‌కుమార్, మోహన్‌లాల్, ముఖేశ్ రిషి, మధుబాల, కాజల్ ఇలా భారీ స్టార్ క్యాస్ట్ ఈ సినిమాలో ఉంది. అయినా అందరి చూపు ప్రభాస్ పైనే. ప్రేక్షకులంతా ప్రభాస్ (Prabhas) మీదున్న అభిమానంతోనే ఈ సినిమాకు వస్తారని సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అందుకే ట్రైలర్‌లో ప్రభాస్ షాట్స్ ఎక్కువగా పెట్టినట్లు అనిపిస్తుంది. ఇందులో దాదాపు అరగంట పాటు ప్రభాస్ పాత్ర ఉంటుందనీ, తన కెరీర్‌లో తప్పకుండా గుర్తుండపోయే సినిమా అవుతుందని పదే పదే చెబుతున్నాడు. శనివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరగనుంది. దీనికి ప్రభాస్ వస్తాడా? రాడా అనే టాపిక్ టాక్ ఆప్ ది టౌన్‌గా మారింది.
సోషల్ మీడియాలో కూడా కన్నప్ప టీమ్‌ను ట్యాగ్ చేస్తూ 'ప్రభాస్ ప్రమోషన్స్‌కి వస్తున్నాడా? లేదా అది చెప్పండి' అని అభిమానులు నిలదీస్తున్నారు. అయితే ప్రభాస్ కూడా ఈ ఈవెంట్‌కు వస్తాడనే అంతా భావిస్తున్నారు. ఇప్పటికే మోహన్‌బాబు ప్రభాస్‌కి స్వయంగా ఫోన్ చేసి ఈవెంట్‌కు ఆహ్వానించారని తెలిసింది. మోహన్‌బాబు కోసం ఆయన ఈ సినిమా చేశారని ఇటీవల మోహన్‌బాబు చెప్పిన సంగతి తెలిసిందే! మరోపక్క ప్రభాస్ 'రాజాసాబ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ మధ్యన ఆయన ఈవెంట్స్‌లో పెద్దగా కనిపించడం లేదు. ఇటీవల జరిగిన ‘రాజాసాబ్’ టీజర్ లాంచ్‌లోనూ ఆయన కనిపించలేదు.అలాంటిది కన్నప్పకు వస్తాడా అనేది ప్రశ్నగా మారింది. ఒకవేళ ప్రభాస్ ఈ వేడుకకు వస్తే మాత్రం సినిమాకు బూస్ట్ ఇచ్చినట్లు అవుతుంది. సినిమాకు మరింత క్రేజ్ పెరుగుతుంది.