Puri Jagannadh: పూరీ, ఛార్మి స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ సందర్శన

ABN , Publish Date - Sep 03 , 2025 | 02:08 PM

దర్శకుడు పూరి జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి... స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ని సందర్శించారు. ఆధ్యాత్మికంగానే కాకుండా సామాజికంగానూ ఈ కేంద్రం ద్వారా జరుగుతున్న సేవలను పూరి కొనియాడారు.

Statue of Equality

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) ఇప్పుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) తో సినిమా తీస్తున్నాడు. ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ ఇటీవలే మొదలైంది.సంయుక్త (Samyuktha), టబు (Tabu), విజయ్ కుమార్ (Vijay Kumar) ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీనిని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో రిలీజ్ చేయడానికి నిర్మాతలు పూరి జగన్నాథ్‌, ఛార్మి కౌర్ (Charmy) సన్నాహాలు చేస్తున్నారు.

p3.jpeg


ఇటీవల పూరీ జగన్నాథ్‌, ఛార్మితో కలిసి స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీని సందర్శించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా తెలియచేశారు. ఆ సందర్భంగా చిన్న జీయర్ స్వామిని కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నట్టు పూరి తెలిపారు.

puri letter.jpeg

స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ రూపకల్పనకోసం ప్రముఖ పారిశ్రామిక వేత్త రామేశ్వరరావు ఎంతో డబ్బుని, సమయాన్ని, శక్తిని ధారపోశారని, ఆయన ఆలోచనలకు ప్రతి రూపం అయిన ఈ విగ్రహం హైదరాబాద్ కు ఆధ్యాత్మిక శోభను చేకూర్చిందని పూరి జగన్నాథ్‌ తెలిపారు. స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీ నిర్వహణ కమిటీ కేవలం ఆధ్యాత్మికతకే ప్రాధాన్యం ఇవ్వకుండా, కంటిచూపు కోల్పోయిన వందలాది మంది దివ్యాంగులకు విద్యను నేర్పించడం, అట్టడుగు వర్గాల వారికి వైద్యసహాయం చేయడం తాను గమనించానని పూరి తెలిపారు. ఈ పవిత్ర ప్రదేశాన్ని ప్రతి రోజు వందలాది మంది సందర్శిస్తున్నారని, ఇక్కడకు వచ్చే పాఠశాల విద్యార్థులకు సమాజంలో సమానత పట్ల ఈ స్థలం గొప్ప స్ఫూర్తిని కలిగిస్తుందని పూరి అభిప్రాయపడ్డారు.

p1.jpeg

Also Read: Mahavatar Narsimha: త‌నువు మోసిన ప్రాణ‌మా.. వీడియో సాంగ్ వ‌చ్చేసింది

Also Read: Tollywood: ఆ గ్యాప్ ను.. 'అఖండ 2' ఫిల్ చేస్తుందా!

Updated Date - Sep 03 , 2025 | 02:08 PM