Mahavatar Narsimha: తనువు మోసిన ప్రాణమా.. వీడియో సాంగ్ వచ్చేసింది
ABN , Publish Date - Sep 03 , 2025 | 01:22 PM
మహావతార్ నరసింహ.చిత్రం నుంచి తనువు మోసిన ప్రాణమా.. వీడియో సాంగ్ బుధవారం రిలీజ్ చేశారు.
రెండు నెలల క్రితం థియేటర్లలో విడుదలై ఫ్యామిలీ ఆడియన్స్‌లో మంచి టాక్ తెచ్చుకుని సంచలన విజయం సాధించడంతో పాటు బాక్సాఫీస్‌ను షాక్‌కు గరి చేసిన చిత్రం మహావతార్ నరసింహ (Mahavatar Narsimha). గడిచిన రెండు నెలలుగా ప్రతి వారం అనేక భారీ, పెద్ద, చిన్న చిత్రాల నుంచి పోటీ ఎదుర్కోని ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతూ విశ్లేషకులను సైతం ఆశ్చర్య పరుస్తుంది. సినిమా విడుదలయ్యాక పాటలకు సైతం మంచి ఆదరణ దక్కడంతో ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో చాలామందికి ఎంతో ప్రీతి పాత్రమయ్యాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఓం నమో భగవతే వాసుదేవాయ పాట విశేష ప్రజాధరణ దక్కించుకుంది.
ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం తనువు మోసిన ప్రాణమా (Thanuvu Mosina Praanamaa ) అంటూ సాగే మరో అద్భుతమైన వీడియో సాంగ్‌ను (Video Song)విడుదల చేశారు. శ్యామ్ సీఎస్ (Sam CS) సంగీతంలో చిన్మయి శ్రీపాద (Chinmayi Sripada) ఈ పాటను ఆలపించగా సంస్కృత శ్లోకం ఆధారంగా ప్రముఖ రచయుత, నటుడు, లిరిసిస్ట్ రాకేందు మౌళి (Rakendu Mouli) సాహిత్యం అందించాడు. ఇప్పుడు ఈ పాట సైతం ఊహించని వ్యూస్ దక్కించుకుంటూ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. తల్లీ బిడ్డల ఆప్యాయతలకు అద్దం పట్టేలా ఉండే ఈ పాట విన్న వారు గాయని మృధు మధుర స్వరానికి మైమరుస్తూ ఒకటికి రెండు సార్లు తనివి తీరా వింటూ ఆస్వాదిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఇప్పుడూ వినేయండి మరి.