సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kamakshi Bhaskarla: రొమాంటిక్‌.. పాత్ర‌లు చేయాల‌ని ఉంది!

ABN, Publish Date - Nov 17 , 2025 | 08:57 AM

కథానాయికగా చేస్తూనే, నటిగా పేరు తెచ్చే సహాయ పాత్రలనూ చేస్తున్నాను’ అని కామెడీ, రొమాంటిక్ పాత్ర‌లంటే ఇష్ట‌మ‌ని కానీ అవ‌కాశాలు అంత‌గా రావ‌డం లేద‌ని కామాక్షి భాస్కర్ల అన్నారు.

Kamakshi Bhaskarla

‘విజయ్‌ సేతుపతి, సుహాస్‌ లాంటి నటులు హీరోలుగా నటిస్తూనే ఇతర పాత్రల్లోనూ మెప్పిస్తున్నారు. నేను కూడా ఆ తరహాలో ఎందుకు ప్రయత్నించకూడదు అనుకున్నాను. అందుకే కథానాయికగా చేస్తూనే, నటిగా పేరు తెచ్చే సహాయ పాత్రలనూ చేస్తున్నాను’ అని కామెడీ, రొమాంటిక్ పాత్ర‌లంటే ఇష్ట‌మ‌ని కానీ అవ‌కాశాలు అంత‌గా రావ‌డం లేద‌ని కామాక్షి భాస్కర్ల (Kamakshi Bhaskarla) అన్నారు.

అల్లరి నరేశ్ (Allari Naresh), కామాక్షి భాస్కర్ల జంటగా నటించిన చిత్రం ‘12 ఏ రైల్వే కాలనీ’ (12A Railway Colony). నాని కాసరగడ్డ దర్శకత్వంలో శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ సినిమాకు దర్శకుడు డాక్టర్‌ అనిల్‌ విశ్వనాథ్‌ కథను అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. ఈ నెల 21న థియేట‌ర్ల‌లో విడుదలవుతోంది. ఈ సందర్భంగా కామాక్షి భాస్కర్ల సినిమా విశేషాలను పంచుకున్నారు.

ఇప్పటివరకూ తెలుగులో రాని విభిన్న కథ, కథనాలతో ఈ సినిమా రూపొందింది. థ్రిల్లింగ్‌ అంశాలతో ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఇందులో నా పాత్ర పేరు ఆరాధన. కథను మలుపు తిప్పే పాత్ర. ప్రేక్షకులకు గుర్తుండిపోయేలా దర్శకుడు తీర్చిదిద్దారు. ప్రేమవల్ల ఆమె జీవితం ఎలాంటి మలుపు తీసుకుందనేది ఆసక్తికరంగా ఉంటుంది. అలాగే రైల్వే కాలనీలో జరిగిన అనూహ్య సంఘటనలు ఎలాంటి పరిస్థితులకు దారి తీశాయనేది ప్రేక్షకులను థ్రిల్‌ చేస్తాయి.

Updated Date - Nov 17 , 2025 | 09:01 AM