సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vijay Devarakonda: మరోసారి హాలీవుడ్ నటుడితో విజయ్ దేవరకొండ

ABN, Publish Date - Sep 16 , 2025 | 07:09 PM

ఎక్కడ పోగొట్టుకున్నది అక్కడే వెతుక్కోవాలని డిసైడ్ అయ్యాడు రౌడీ హీరో.. 'లైగర్' కోసం హాలీవుడ్ పర్సనాలిటీ కదలి వచ్చినా కలసి రాలేదు .. అందుకే ఈ సారి అదే హాలీవుడ్ నుంచి మరో స్టార్ ని తీసుకొచ్చి కొత్త ప్రయోగం చేయబోతున్నాడు.

'కింగ్ డమ్' ( Kingdom )సినిమా నిరాశ పరచడంతో రౌడీ హీరో విజయ్ దేవరకొండ( Vijay Devarakonda) కు అర్జెంటుగా హిట్టు అవసరం వచ్చి పడింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆ మూవీ ఫలితం మొదట్లో బాగానే అనిపించినా థియేట్రికల్ రన్ ముగిసే సరికి నిరాశజనక ఫలితమే ఇచ్చింది.‌ దీంతో తదుపరి మూవీ పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలో రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityayan ) దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై ఓ సెన్సేషనల్ పాన్-ఇండియా ప్రాజెక్ట్‌లో బిజీ అయిపోయాడు. విజయ్ కి జోడిగా రశ్మిక (Rashmika ) జతకడుతుంది. మరో ట్విస్ట్ ఏంటంటే... హాలీవుడ్ స్టార్ ఈ చిత్రంలో విలన్‌గా ఎంట్రీ ఇస్తుండటం ఆసక్తికరంగా మారింది.


‘ది మమ్మీ’ సిరీస్‌తో ఇండియన్ ఆడియెన్స్‌కి బాగా సుపరిచితమైన ఆర్నాల్డ్ వోస్లూ (Arnold Vosloo) తొలిసారి టాలీవుడ్‌లో అడుగు పెట్టబోతున్నాడు. ఇక ఈ సినిమా గురించి ఇన్‌సైడ్ టాక్ ఏంటంటే.. విజయ్ దేవరకొండ ఈ సారి ఓ డైనమిక్ రోల్‌లో కనిపింబోతున్నాడు. రాహుల్ సంకృత్యాన్ మార్క్ స్టోరీ టెల్లింగ్‌తో పాటు, ఆర్నాల్డ్ లాంటి హాలీవుడ్ హెవీ వెయిట్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఈ మూవీకి గ్లోబల్ అప్పీల్ తెచ్చిపెడుతోంది. రశ్మిక కూడా తనదైన స్టైల్‌తో సినిమాకి గ్లామర్ జోడిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది.

ఈ కాంబో గురించి సోషల్ మీడియాలో ఇప్పటికే హైప్ మొదలైంది. విజయ్ ఫ్యాన్స్ ఈ సినిమా ఖచ్చితంగా గ్లోబల్ మార్కెట్ ను షేక్ చేస్తుందని కాలర్ ఎగరేస్తున్నారు. మరోవైపు ఈ సినిమా ఇండియన్ సినిమా స్కేల్‌ని మరో లెవెల్‌కి తీసుకెళ్లబోతోందని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సో, ఈ భారీ ప్రాజెక్ట్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి మరి!

Read Also: Manchu Lakshmi: షర్ట్ విప్పి ఎందుకు తిరుగుతున్నావని మహేష్ బాబును అడగగలరా

Read Also: Kalyan Shankar: మ్యాడ్ డైరెక్టర్.. ఈసారి భయపెడతాడట

Updated Date - Sep 16 , 2025 | 07:48 PM