సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sasivadane: హీరోయిన్‌గా హిట్‌3 భామ‌.. కొత్త సినిమా ట్రైల‌ర్ వ‌చ్చింది

ABN, Publish Date - Sep 29 , 2025 | 10:52 AM

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ హీరో-హీరోయిన్లుగా నటించిన ‘శశివదనే’ చిత్రాన్ని సాయి మోహన్ ఉబ్బన దర్శకుడు గా తెరకెక్కించారు.

Sasivadane

రక్షిత్ అట్లూరి (Rakshith Atluri), కోమలి ప్రసాద్ (Komalee Prasad) హీరో-హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘శశివదనే’(Sasivadane). గౌరీ నాయుడు సమర్పణలో ఏజీ ఫిల్మ్ కంపెనీ మరియు ఎస్‌వీఎస్ స్టూడియోస్ బ్యానర్లపై అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోదాల ఈ సినిమాను నిర్మించ‌గా సాయి మోహన్ ఉబ్బన ( SaiMohan Ubbana) దర్శకత్వం వ‌హించాడు. ఏడాది క్రిత‌మే విడుద‌ల కావాల్సిన ఈ సినిమా అనేక అవాంత‌రాల‌ను దాటుకుని ఎట్ట‌కేల‌కు రిలీజ్‌కు రెడీ అయింది.

ఈ క్ర‌మంలో ఇప్పటివరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్ ద్వారా ప్రేక్షకుల నుంచి మంచి ఆద‌ర‌ణ‌న‌ను ద‌క్కించుకుంది. ఈ నేప‌థ్యంలో తాజాగా సోమ‌వారం ఈ సినిమా ట్రైల‌ర్ విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. ఇటీవ‌ల వ‌చ్చిన క‌న్యాకుమారి త‌ర‌హాలోనే అచ్చ‌మైన‌, స్వ‌చ్చ‌మైన తెలుగు ప‌ల్లె ప్రేమ‌క‌థ‌ అని తెలుస్తోంది. దసరా సీజన్ ముగిసిన వెంట‌నే అక్టోబర్ 10న భారీ ఎత్తున రిలీజ్ చేయ‌నున్నారు. ఈ చిత్రానికి శరవణ వాసుదేవన్ సంగీతం, అనుదీప్ దేవ్ (Anudeep Dev) నేపథ్య సంగీతం అందించ‌గా గ్యారీ బీహెచ్ ఎడిటర్‌గా వ్య‌వ‌హరించారు. శ్రీమాన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు.

Updated Date - Sep 29 , 2025 | 10:52 AM