Pawan Kalyan: పవన్ పైనే నలుగురు భామల ఆశలు !

ABN , Publish Date - Jul 23 , 2025 | 05:11 PM

ఒక్క హీరో.. ఏకంగా నలుగురు హీరోయిన్లకు లైఫ్ లైన్ గా మారాడు. ఇండస్ట్రీలో అడుగుపెట్టి కాలం గడుస్తున్నా వారికి కావాల్సిన హిట్ మాత్రం ఇన్నాళ్లు దొరకలేదు. ఇప్పుడు ఆ హీరోతో తమ స్టేటస్ ను పెంచుకునే ఛాన్స్ చిక్కింది.. మరి ఆ అదృష్టం దక్కుతుందా లేదా అన్నది ఉత్కంఠ గా మారింది.

ఇండస్ట్రీలో విజయం అనేది చాలా మందికి అందని ద్రాక్షగా ఉండిపోతుంది. కొంత మంది మాత్రమే ఓవర్ నైట్ లో స్టార్ అయితే మరికొందరికి ఎంత కష్టపడ్డా కొన్నిసార్లు ఎంత కాలం గడిచినా వారికి కావలసిన హిట్టు దొరకదు. ఇంకొందరికి మాత్రం అది లైఫ్ టైమ్ డ్రీమ్ గానే మిగిలిపోతుంది. ఇప్పుడు అలా హిట్టు కోసం ఎదురుచూస్తున్నారు నిధి అగ‌ర్వాల్ (Nidhhi Agerwal), ప్రియాంక అరుళ్ మోహ‌న్ (Priyanka Arul Mohan), రాశీ ఖ‌న్నా(Raashi Khanna), శ్రీలీల (Sreeleela ). ఈ నలుగురు హీరోయిన్లు ఒక్క హీరో పైనే ఆశలు పెట్టుకున్నారు. ఆయనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) . ఆయన సినిమాల్లో నటించే ఛాన్స్ ఈ నలుగురు భామలకూ దక్కింది.


నిధి అగర్వాల్ విషయానికి వస్తే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి దాదాపు పది సంవత్సరాలు దాటినా ‘ఇస్మార్ట్ శంకర్’ (iSmart Shankar)తప్ప గుర్తుండిపోయే హిట్ లేదు. అయినప్పటికీ బ్యూటీ లక్‌ కారణంగా పవన్ కళ్యాణ్ లాంటి పవర్‌ఫుల్ హీరోతో ‘హరిహర వీరమల్లు’ (Hari hara Veeramallu)లో ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమాతో తన కెరీర్‌ని మళ్ళీ ట్రాక్‌పై పెట్టాలని ఫుల్ హోప్స్‌తో ఉందీ బ్యూటీ. ఇక పవన్ నటిస్తున్న ‘ఓజీ’ (OG)లో ప్రియాంక అరుళ్ మోహన్ జోడీ కడుతోంది. ఇప్పటి వరకు నాని(Nani)తో రెండు తెలుగు సినిమాలు చేసిన ప్రియాంకకు ఇలాంటి బిగ్ స్టార్ తో వర్క్ చేయడం ఫస్ట్ టైమ్. ‘ఓజీ’ సినిమాతో తన టాలెంట్‌ని నిరూపించుకుంటే స్టార్ హీరోల మూవీస్ లో ఆఫర్లు క్యూ కట్టే ఛాన్స్ ఉందని ఆశపడుతోంది.

మరోవైపు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagath Singh)లో పవన్‌తో శ్రీలీల, రాశీ ఖన్నా కనిపించనున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన బిజీగా గడిపిన రాశీ... ఇప్పుడు ‘తెలుసు కదా’ (Telusu Kada) తప్ప మరో పెద్ద ప్రాజెక్ట్ లేక సైలెంట్‌గా ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తే.. రాశీ మళ్ళీ ఫుల్ డిమాండ్‌లోకి రావచ్చనే టాక్ నడుస్తోంది. ఇక శ్రీలీల విషయానికి వస్తే ‘గుంటూరు కారం’ (Guntur Kaaram ) తర్వాత విజ్జిపాప ఫోకస్ మొత్తం ‘ఉస్తాద్ భగత్ సింగ్’పైనే ఉంది. ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్స్‌తో ఫుల్ జోష్‌లో కనిపిస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యాక శ్రీలీల టాప్ హీరోయిన్స్ లిస్ట్‌లో ఫిక్స్ అవుతుందని ఇండస్ట్రీ టాక్. మరి పవన్ కళ్యాణ్ సినిమాలపైనే ఆశలు పెట్టుకున్యన ఈ నలుగురు భామల కలలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

Read Also: Rashmi Gautham: రష్మీ ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకుంది.

Read Also: Tanushree Dutta: మరోసారి వార్తల్లోకి

Updated Date - Jul 23 , 2025 | 06:45 PM