Tamannaah Bhatia: ఛీ.. మొటిమలు పోవాలంటే ఆ పని చేయమంటున్న తమన్నా

ABN , Publish Date - Aug 04 , 2025 | 09:34 PM

ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందం లేకపోతే మనుగడ కష్టం. దానికోసమే హీరోయిన్లు కడుపు మాడ్చుకొని మరీ కష్టపడుతూ ఉంటారు.

Tamannaah Bhatia

Tamannaah Bhatia: ఇండస్ట్రీ ఒక గ్లామర్ ప్రపంచం. ఇక్కడ అందం లేకపోతే మనుగడ కష్టం. దానికోసమే హీరోయిన్లు కడుపు మాడ్చుకొని మరీ కష్టపడుతూ ఉంటారు. అంతేనాముఖంపై ఒక చిన్న మచ్చ కూడా రాకుండా జాగ్రత్త పడుతుంటారు. ఇండస్ట్రీలో చాలామంది నేచురల్ పద్దతిలో కంటే ఎక్కువ స్కిన్ ట్రీట్ మెంట్లతోనే అందాన్ని కొనితెచ్చుకుంటున్నారు. లిప్ ఫిల్టర్లు అని, ప్లాస్టిక్ సర్జరీలు అని అందాలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే ఇండస్ట్రీలో చాలా తక్కువమంది నేచురల్ అందంతో మెప్పిస్తున్నారు. అలాంటి హీరోయిన్స్ లో మిల్కి బ్యూటీ తమన్నా (Tamannaah) ఒకరు.


అందం, అభినయం కలబోసిన రూపం తమన్నా. అమ్మడికి మేకప్ అవసరం లేదు. నేచురల్ గానే ఈ ముద్దుగుమ్మ పాలమీగడ లాంటి దేహంతో ముట్టుకుంటే మాసిపోయేలా ఉంటుంది. ఇక మొదటి నుంచి ఈ చిన్నది నేచురల్ గానే తన అందాన్ని కాపాడుకుంటూ వస్తుందట. తాజాగా తమన్నా తన చర్మ సంరక్షణ గురించి ఒక ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ముఖంపై మొటిమలు రాకుండా తనదగ్గర అద్భుతమైన చిట్కా ఉందని కూడా చెప్పుకొచ్చింది. ప్రతి ఒక్కరు హీరోయిన్ లాంటి చర్మ సౌందర్యం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. క్రీములు, పౌడర్లు పూస్తూ ఉంటారు.


అయితే మీ ముఖంపై మొటిమలు ఉండి.. అవి అస్సలు పోవడం లేదు అంటే తమన్నా చెప్పిన చిట్కా పాటించండి. వెంటనే ముఖంపై మొటిమలు మాయామైపోతాయని మిల్కి బ్యూటీ చెప్పుకొస్తుంది. అదేంటంటే.. మన నోటిలో ఉండే ఉమ్మును మొటిమల మీద రాసి నిద్రపోతే .. ఉదయం కల్లా ఆ మొటిమలు తగ్గుతాయట. ఛీ.. ఏంటి.. ఉమ్మి రాయాలా.. ?యాక్ అని తీసిపడేయొద్దు. ఆ ఉమ్మిలో ఎన్నో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయని తమ్ము బ్యూటీ చెప్పుకొచ్చింది. ' ఉమ్మిలో ఎన్నో యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు ఉంటాయి. దాంతో మొటిమలను నివారించవచ్చు. ముఖ్యంగా ఉదయమే నిద్రలేచిన వెంటనే బ్రష్ కూడా చేయకుండా వచ్చే సలైవాలో యాంటీ బ్యాక్టీరియా ఉంటుంది. అవి మొటిమలతో పోరాడుతుంది.


దీని వెనుక సైన్స్ కూడా ఉంది. ఇది మాత్రమే కాదు చర్మ సంరక్షణమీద శ్రద్ద పెట్టాలి. ఏజ్ ఎక్కువగా కనిపించకుండా ఉండాలంటే 25 ఏళ్ళ నుంచే యాంటీ ఏజింగ్ క్రీములను వాడడం మొదలుపెట్టాలి. అలా చేస్తేనే మన చర్మం పొడిబారకుండా.. వయస్సు పై బడకుండా కనిపిస్తుంది' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తమన్నా చెప్పిన మాటలు నెట్టింట వైరల్ గా మారాయి.

Garividi Lakshmi: ‘గరివిడి లక్ష్మి’.. న‌ల జీల‌క‌ర్ర మొగ్గ పాటొచ్చేసింది

Jr Ntr Kantara: ‘కాంతార 3’లో.. జూనియర్ ఎన్టీఆర్! నిజ‌మేనా?

Updated Date - Aug 04 , 2025 | 09:34 PM