Garividi Lakshmi: ‘గరివిడి లక్ష్మి’.. న‌ల జీల‌క‌ర్ర మొగ్గ పాటొచ్చేసింది

ABN , Publish Date - Aug 04 , 2025 | 08:41 PM

ఆనంది, రాగ్ మ‌యూర్ ప్రధాన పాత్రల్లో ఉత్త‌రాంధ్ర జాన‌ప‌ద క‌ళాకారిణి ‘గరివిడి లక్ష్మి’ క‌థ‌తో ఓ చిత్రం తెరకెక్కుతోంది.

Garividi Lakshmi

ఆనంది (Anandhi), రాగ్ మ‌యూర్ ( Rag Mayur) ప్రధాన పాత్రల్లో గౌరీ నాయుడు జమ్ము (Gouri Nayudu) తెరకెక్కిస్తోన్న సినిమా ‘గరివిడి లక్ష్మి’ (Garividi lakshmi). పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory) బేనర్‌పై టీజీ విశ్వప్రసాద్ (T.G. Vishwa Prasad), టీజీ కృతి ప్రసాద్ (Krithi Prasad) నిర్మిస్తున్నారు. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే ఈ చిత్రం నుంచి విడుద‌ల చేసిన పోస్ట‌ర్లు, టీజ‌ర్ సినిమాపై మంచి రెస్పాన్స్ తీసుకు వ‌చ్చాయి.

ఈక్ర‌మంలో మేక‌ర్స్ తాజాగా ఈ చిత్రం నుంచి న‌ల జీల‌క‌ర్ర మొగ్గ అంటూ సాగే లిరిక‌ల్ వీడియో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఉత్త‌రాంద్ర జాన ప‌దాల నుంచి తీసుకున్న ఈ పాట‌కు చ‌ర‌ణ్ అర్జున్ (Charan Arjun) సంగీతం అందించ‌గా అన‌న్య భ‌ట్ (Ananya bhat,), జాన‌కీ రామ్‌, గౌరీ నాయుడు జ‌మ్ము ఆల‌పించారు. అయితే.. ఈ పాట వింటున్నంత సేపు మ‌నం ఆ కాలంలో విహారిస్తున్న‌ట్లుగానే అనిపించ‌డంతో పాటు విజిల్స్ సైతం వేసేలా ఉంది. అంత‌గా ఊపు తెప్పిస్తూ, డ్యాన్స్ చేయించేలా శ్రోత‌ల చెవుల‌కింపుగా పాట‌ను తీర్చిదిద్దారు. జాన ప‌దాలు ఇష్ట ప‌డే వారు ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఈ పాట‌ను విన‌డం మిస్స‌వ‌ద్దు.

ఇదిలాఉంటే.. గరివిడి లక్ష్మి ఒక గొప్ప బుర్రకథ కళాకారిణి. ఉత్తరాంధ్ర జానపద సంప్రదాయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు దక్కింది. ఈ సినిమాలో చరణ్‌ అర్జున్‌ సంగీతం ఉత్తరాంధ్ర సంస్కృతిని ఆవిష్కరిస్తూ హృదయాన్ని తాకేలా ఉంది. ఇంకా ఈ సినిమాలో న‌రేశ్‌, రాశి, అంకిత్ కొయ్య‌, శ‌ర‌ణ్య ప్ర‌దీప్‌, మీసాల ల‌క్ష‌ణ్‌, కంచ‌ర‌పాలెం కిశోర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Updated Date - Aug 04 , 2025 | 08:48 PM