Jr Ntr Kantara: ‘కాంతార 3’లో.. జూనియర్ ఎన్టీఆర్! నిజమేనా?
ABN , Publish Date - Aug 04 , 2025 | 08:17 PM
కన్నడ నటుడు రిషభ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కాంతారా చాప్టర్-1
కన్నడ నటుడు రిషభ్ శెట్టి (Rishabh Shetty) స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘కాంతారా చాప్టర్-1’ (KantaraChapter1). గతంలో వచ్చిన ‘కాంతార’ సినిమాకు ప్రీక్వెల్‌గా వస్తోంది. అక్టోబరు 2న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో టోటల్ నేషన్‌ను షేక్ చేస్తోంది..ఈ సినిమా అనంతరం కాంతారా చాప్టర్-1కు సీక్వెల్‌గా రాబోతున్న కాంతార (Kantara3)మూడవ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Ntr) కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్ర పెద్దదే కాకుండా కథకు టర్నింగ్ పాయింట్ కూడా అవుతుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక ‘కాంతార 3’ నిర్మాణానికి సంబంధించి హోంబలే ఫిల్మ్స్, రిషబ్ శెట్టి (Rishabh Shetty)మధ్య ఒప్పందాలు ఇప్పటికే ఫిక్స్ అయ్యాయని సమాచారం. అయితే ఈ కాంతారా చాప్టర్-1 అనంతరం రిషబ్ చేతిలో ఉన్న ఇతర సినిమాలు పూర్తయ్యాకే సీక్వెల్ తెర మీదకు రానున్నట్లు సమాచారం. అలాగే ఎన్టీఆర్ ఇప్పుడు హోంబులే సంస్థలోనే ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో డ్రాగన్ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.
ఇదిలాఉంటే ప్రస్తుతం ‘కాంతార: చాప్టర్ 1’ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ దశలో ఉండగా అక్టోబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.అయితే ఈ కాంతార, ఎన్టీఆర్ వార్తలపై అధికారికంగా అయితే ఎలాంటి స్పష్టటత లేదు. త్వరలో విడుదల కాబోతున్న సినిమా క్లైమాక్స్‌లోనే ఇందుకు సంబంధించి సర్‌ఫ్రైజ్ ఫ్లాన్ చేశారని నెట్టింట ప్రచారం మాత్రం జరుగుతుంది. ఒక వేళ ఇదే నిజమైతే మాత్రం రెండు రాష్ట్రాల ఫ్యాన్స్ కు ఈ వార్త పెత్త ఫెస్ట్ అవనుంది.