Nivetha thomas: బరువు తగ్గిన నివేదా థామస్.. మరీ ఇంత అందంగా ఉంటే ఎలా
ABN , Publish Date - Sep 08 , 2025 | 03:11 PM
అందాల భామ నివేదా థామస్ (Nivetha Thomas) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా ఎదిగింది.
Nivetha thomas: అందాల భామ నివేదా థామస్ (Nivetha Thomas) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలనటిగా కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా ఎదిగింది. న్యాచురల్ స్టార్ నాని నటించిన జెంటిల్ మేన్ సినిమాతో హీరోయిన్ గా తెలుగుతెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకున్న నివేదా ఆ తరువాత వెను తిరిగి చూసుకోలేదు. నిన్ను కోరి, జి లవకుశ, వకీల్ సాబ్, 35 ఇది చిన్న కథ కాదు లాంటి హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.
ముఖ్యంగా 35 చిన్న కథ కాదు సినిమాలోని ఆమె నటనకు ఎన్నో అవార్డులు నడుచుకుంటూ వచ్చాయి. ఇక ఒకప్పుడు సన్నజాజి తీగలా ఉండే నివేదా ఒక్కసారిగా బరువు పెరిగి కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది. సడెన్ గా నివేదాకు ఏమైంది.. ? ఎందుకు బరువు పెరిగింది.. ? అనే విషయం ఎవరికీ తెలియదు. అయితే అనారోగ్య సమస్యల వలనే ఆమె బరువు పెరిగినట్లు సోషల్ మీడియాలో టాక్. సగం నివేదా సినిమాలు చేయకపోవడానికి కారణం కూడా అదే. బరువు పెరిగాకా నివేదా సోషల్ మీడియాలో కూడా కనిపించడం మానేసింది.
ఇక తెలంగాణ గద్దర్ అవార్డ్స్ వేడుకలో నివేదా సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచింది. బరువు పెరిగిన నివేదాను అలా చూసి నెటిజన్స్ షాక్ అయ్యారు. ఏంటి.. ఈమె ఇలా మారిపోయింది అని ట్రోల్ చేశారు. ఆ తరోల్స్ ను సీరియస్ గా తీసుకున్న నివేదా సడెన్ గా బరువు తగ్గి కనిపించింది. మొన్న జరిగిన ఓనమ్ పండగకు సంబంధించిన ఫోటోలను నేడు అభిమనులతో పంచుకుంది. ఈ ఓనమ్ చీరలో నడుము చూపిస్తూ నివేదా ఎంతో అందంగా కనిపించింది. గద్దర్ అవార్డ్స్ సమయంలో కన్నా ఇప్పుడు కొద్దిగా సన్నబడి కనిపించింది. చక్కన్నమ్మ చిక్కినా అందమే అన్నట్లు నివేదా ఈ లుక్ లో మరింత అందంగా కనిపించింది. దీంతో అభిమానులు ఎంత ముద్దుగున్నావే అంటూ పాటలు పాడేస్తున్నారు. మరి ఇకనుంచి అమ్మడు సినిమాలు చేయడం మొదలుపెడుతుందేమో చూడాలి.
Raghava Lawrence: నిజంగా.. దేవుడివి సామి! మరోసారి ఉదారత చాటుకున్న లారెన్స్
OG - Thaman: కొత్త ఇన్‌స్ట్రూమెంట్.. 117 మంది వాయిద్య కళాకారులతో...