Raghava Lawrence: నిజంగా.. దేవుడివి సామి! మ‌రోసారి ఉదార‌త చాటుకున్న లారెన్స్‌

ABN , Publish Date - Sep 08 , 2025 | 01:37 PM

డాన్స్‌, యాక్షన్‌, నటనతో అందరిని ఆకట్టుకుంటూ త‌న‌కంటూ ప్ర‌త్యేక బ్రాండ్‌ ఏర్ప‌ర్చుకున్న‌ హీరో రాఘవ లారెన్స్

Raghava Lawrence

సినిమాల్లో డాన్స్‌, యాక్షన్‌, నటనతో అందరిని ఆకట్టుకుంటూ త‌న‌కంటూ ప్ర‌త్యేక బ్రాండ్‌ ఏర్ప‌ర్చుకున్న‌ హీరో రాఘవ లారెన్స్ (Raghava Lawrence). నిత్యం అనేక సేవా కార్య‌క్ర‌మాల‌తో వేలాది మంది జీవితాల్లో వెలుగు నింపుతూ ఎంతోమందికి ఆద‌ర్శంగా నిలుస్తున్నాడు. కేవ‌లం సినిమాలకు మాత్రమే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడేలా ఎన్నో సేవా, ఆధ్యాత్మిక‌ కార్యక్రమాలు చేస్తున్న ఆయన పేరు ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో మారు మ్రోగుతోంది. అంతేగాక అనేక‌మంది త‌రుచూ.. గూగుల్‌లో (Google ) “Raghava Lawrence helping people”, “Raghava Lawrence charity work”, “Raghava Lawrence hospital help” వంటి పదాలతో ఎక్కువగా శోదిస్తూ ఉన్నారు.

Raghava Lawrence Trust ద్వారా ఆయన పేదలకు వైద్య సహాయం, విద్యకు తోడ్పాటు, ఆకలితో ఉన్నవారికి ఆహారం పంపిణీ వంటి సేవలు అందిస్తున్నారు. ఆసుపత్రుల్లో చికిత్స కోసం డబ్బులేని పిల్లలకు వైద్య ఖర్చులు భరిస్తూ సహాయం చేస్తున్నారు. పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తూ వారి భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారు. అంతేగాక పేద‌ రైతుల‌కు ట్రాక్ట‌ర్లు ఇత‌ర సామాగ్రి అంద‌జేస్తూ చేదోడు వాదోడుగా ఉంటున్నాడు. ఇక క‌రోనా స‌మ‌యంలో అయితే చెప్ప‌న‌వ‌స‌ర‌మే లేదు. లక్షలాది మంది ప్రజలకు ఆహారం (free food distribution), ఆక్సిజ‌న్ (oxygen support), medical aid వంటి సహాయాలను అందించారు. ఈ సేవల కారణంగా “Raghava Lawrence corona help” అనే పదంతో Google లో ఆయన పేరు ట్రెండ్ అయింది.

అయితే.. తాజాగా ఇప్పుడు మ‌రోసారి లారెన్స్ సేవా నిర‌తిని ప్రంచానికి చాటుతూ ఆయ‌న చేసిన మ‌రో సాయం ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బ‌య‌ట‌కు వ‌చ్చి బాగా వైర‌ల్ అవుతోంది. రెండు కాళ్లు స‌రిగ్గా లేని శ్వేత అనే యువ‌తికి ఓ ఆర్టీఫిసియ‌ల్ లెగ్స్ ఏర్పాటు చేయించిన లారెన్స్ ఇప్పుడు ఆ యువ‌తికి ఓ స్కూటీ సైతం బ‌హూక‌రించాడు. అంతేకాకుండా ప్ర‌స్తుతం పూరి గుడిసెలో ఉంటున్నఆమెకు ఇల్లు కొనిచ్చేందుకు ముందుకొచ్చి, ఇంటి నిర్మాణానికి అడ్వాన్స్ కూడా అందించాడు. ఇందుకు సంబంధించి శ్వేతను కలిసిన వీడియోను లారెన్స్‌ సోషల్‌మీడియా ద్వారా షేర్ చేయగా, నెటిజన్లు ఆయనపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలాఉంటే లారెన్స్ గ‌త సంవ‌త్స‌రం జిగ‌ర్తాండ డ‌బుల్ ఎక్స్ సినిమాతో ఆల‌రించ‌గా ప్ర‌స్తుతం కాంచ‌న 4 సినిమాతో ప్రేక్ష‌కుల ఎదుటకు రానున్నాడు. అంతేగాక లోకేశ్‌ క‌న‌గ‌రాజ్ యూనివ‌ర్స్‌లో బెంజ్ అనే సినిమా సైతం ఇప్పుడు చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది.

Updated Date - Sep 08 , 2025 | 01:46 PM