Eesha Rebba:పెళ్లయిన డైరెక్టర్ తో ప్రేమ.. అవసరమా ఈషా
ABN, Publish Date - Oct 21 , 2025 | 11:53 AM
ఇండస్ట్రీ అన్నాకా రూమర్స్ అనేవి కామన్. హీరో హీరోయిన్ సినిమాలో కాకుండా బయట కనిపిస్తే వారిమధ్య ఏదో ఉందని చెప్పుకొచ్చేస్తారు.
Eesha Rebba: ఇండస్ట్రీ అన్నాకా రూమర్స్ అనేవి కామన్. హీరో హీరోయిన్ సినిమాలో కాకుండా బయట కనిపిస్తే వారిమధ్య ఏదో ఉందని చెప్పుకొచ్చేస్తారు. పెళ్ళైన హీరోతో హీరోయిన్ కనిపిస్తే.. ఆ హీరో తన భార్యకు విడాకులు ఇచ్చి ఈమెతో డేటింగ్ చేస్తున్నారు అంటారు. విడాకులు అయిన హీరోతో హీరోయిన్ కనిపిస్తే.. రెండో పెళ్లికి హీరో రెడీ అని చెప్పుకొస్తారు. అయితే ఇక్కడ ప్రతిదీ హీరోయిన్ మీదనే వస్తుంది. తాజాగా ఇలాంటి రూమర్స్ నే ఎదుర్కొంటుంది అచ్చ తెలుగందం ఈషా రెబ్బా.
ఈషా రెబ్బ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందం, అభినయం ఉన్నా కూడా అవకాశాలు లేక, సక్సెస్ రాక చాలా స్ట్రగుల్స్ లో ఉంది. ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ అని ఎదురుచూస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ చిన్నది ఓం శాంతి శాంతి శాంతి అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన జయ జయ జయ జయహే సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది.
ఇక ఓం శాంతి శాంతి శాంతి సినిమాలో డైరెక్టర్ కమ్ యాక్టర్ తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్నాడు. ఏఆర్ సంజీవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక సినిమా విషయం పక్కన పెడితే ఈ సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి తరుణ్ - ఈషా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మధ్య ఎక్కడ చూసినా ఈ జంటనే కనిపిస్తుంది.
తాజాగా దీపావళీ సెలబ్రేషన్స్ లో కూడా వీరు కలిసి కనిపించడం ఈ రూమర్స్ ను ఇంకా నిజం అని నమ్మేలా చేసాయి. హీరో విశ్వక్ సేన్ ఇంట జరిగిన ఈ వేడుకలకు తరుణ్, ఈషా కలిసి పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక వీరిద్దరూ నిజంగా రిలేషన్ లో ఉన్నారని పుకార్లు ఎక్కువ అయ్యాయి.
వీరి రిలేషన్ గురించి వార్తలు రావడంతో ఈషా అభిమానులు ఆమెకు సలహాలు ఇస్తున్నారు. తరుణ్ కి ఆల్రెడీ పెళ్లి అయ్యి విడాకులు కూడా జరిగాయి. ప్రస్తుతం అతను తన తల్లితో కలిసి ఉంటున్నాడు. సీఎంతో పెళ్ళైన వాడితో ప్రేమ అవసరమా ఈషా.. కెరీర్ ని ప్లాన్ చేసుకో.. మంచి సక్సెస్ అందుకో అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకొంతమంది మాత్రం వాళ్లిద్దరూ కలిసి ఒక సినిమాలో నటించారు. ఆ ప్రమోషన్స్ కోసం మాత్రమే కలిసి ఉంటున్నారు. డేటింగ్ వార్తలో ఎలాంటి నిజం లేదు అని చెప్పుకొస్తున్నారు. మరి వీరిప్రేమ కేవలం రీల్ నా.. రియల్ నా అనేది తెలియాల్సి ఉంది.
NTRNEEL: షాకింగ్.. ఎన్టీఆర్- నీల్ మధ్య విభేదాలు .. ఆగిన డ్రాగన్
Samantha: బాయ్ ఫ్రెండ్ తో సమంత దీపావళీ సంబరాలు.. పెళ్లి కన్ఫర్మ్