Vijay Devarakonda: ఐకాన్‌గా.. విజయ్ దేవరకొండ
ABN, Publish Date - Jul 02 , 2025 | 06:05 PM
తినే ప్రతి బియ్యపు గింజ మీద మన పేరు రాసి ఉంటుందన్నది సామెత. ఈ సామెత సినిమా వాళ్లకు కరెక్ట్ గా సరిపోతోంది. హీరోల దగ్గరికి వచ్చే కథలపై వారి పేరు రాసిపెట్టుండాలి. లేదంటే ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరో దగ్గరికి వచ్చి చేరుతుంది. ఇప్పుడు పాన్ ఇండియా హీరో చేయాల్సిన ప్రాజెక్టు చేతులు మారడం హాట్ టాపిక్ గా మారింది.
'ఐకాన్' (Icon) పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్నేళ్ళుగా తెగ సర్క్యూలేట్ అవుతోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), దర్శకుడు శ్రీరామ్ వేణు (Sriram Venu) కాంబోలో ఈ పేరుతో మూవీని తెరకెక్కించాలని దిల్ రాజు (Dil Raju ) ట్రై చేశారు. అటు బన్నీ, ఇటు శ్రీరామ్ వేణు బిజీగా ఉండటంతో ఎంతోకాలంగా హోల్డ్ లోనే ఉండిపోయిందీ ప్రాజెక్ట్. ఆ తర్వాత బన్నీ మూవీ చేస్తారమోనని ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేశారు. కానీ 'పుష్ప' తర్వాత స్టైలిష్ స్టార్ తీరే మారిపోయింది. బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా మారిపోయాడు. దీంతో ‘ఐకాన్’ సంగతి చాన్నాళ్లుగా ఎటూ తేల్చకుండా ఉండటంతో ఒక దశలో ఈ సినిమా ఆగిపోయిందని.. వేరే హీరోతో చేయబోతున్నారని కూడా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అదే జరిగేలా కనిపిస్తోంది.
రీసెంట్ గా 'తమ్ముడు' (Thammudu) ప్రమోషన్స్ లో పాల్గొన్న 'దిల్' రాజు... 'ఐకాన్' మూవీ గురించి చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. బన్నీ స్థానంలో మరో హీరోతో చేయడానికి రెడీ అయినట్లు తెలిపారు. త్వరలోనే యూనివర్సల్ స్క్రిప్ట్ పై శ్రీరామ్ వేణు ఫోకస్ పెడతారని చెప్పారు. అల్లు అర్జున్ కు చెప్పిన స్టోరీని కొంచెం అటు ఇటు గా మార్పులు చేర్పులు చేసి మరో హీరోతో చేయబోతున్నట్లు క్లారిటీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
అయితే 'ఐకాన్' మూవీలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) నటించబోతున్నట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్ లో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఒక్క సక్సెస్ కొడితే లైఫ్ సెట్టైపోయే చరిష్మాగల హీరోలలో ఒక్కడు విజయ్ దేవరకొండ . అందగాడే కానీ.. అందుకు తగ్గ అదృష్టం మాత్రం ఇంకా కలిసి రావడం లేదు. దాని కోసమే తెగ కష్టపడుతున్నాడు. తనను తాను మార్చుకొని హాలీవుడ్ హీరోలా మారి గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. ప్రస్తుతం 'కింగ్ డమ్' తో పాటు మరో రెండు మూడు ప్రాజెక్టులతో బిజీగా ఉన్న రౌడీ హీరో... 'ఐకాన్' మూవీ చేయబోతున్నట్లు ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. అయితే... ఇప్పటికే దిల్ రాజు ప్రొడక్షన్ హౌస్ లో 'ఫ్యామిలీ స్టార్' మూవీ చేసిన విజయ్ దేవరకొండ, మరో సినిమా 'రౌడీ జనార్దన' చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే యేడాది జనం ముందుకు వస్తుందని దిల్ రాజు తెలిపారు. దాని తర్వాత వెంటనే 'ఐకాన్'ను ప్రారంభిస్తారా... లేక మరికొంత టైమ్ తీసుకుంటారా? అనేది చూడాలి.
Read Also: Prabhas: ఫౌజీ కోసం మిర్చి జై ను తీసుకొచ్చినట్టున్నారే
Peddi: రంగస్థలం, ఆర్ఆర్ఆర్ ను మించి పెద్ది.. హైప్ పెంచేసిన చరణ్