Nenu Ready: ఫ్యామిలీ బొనాంజగా హవీష్ మూవీ
ABN, Publish Date - Jun 26 , 2025 | 10:43 AM
హవీష్ నటిస్తున్న కొత్త సినిమా 'నేను రెడీ'. జూన్ 25న హవీష్ పుట్టిన రోజు సందర్భంగా ఈ టైటిల్ ను ప్రకటించి, గ్లింప్స్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
'నువ్విలా, జీనియస్, రామ్ లీలా, సెవెన్' వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో హవీష్ (Havish). జూన్ 25 అతని పుట్టిన రోజు. ఆ సందర్భంగా ప్రస్తుతం సెట్స్ పై ఉన్న హవీష్ మూవీ టైటిల్ ను మేకర్స్ ప్రకటించారు. అలానే టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. 'నేను రెడీ' (Nenu Ready) అనే పేరు పెట్టిన ఈ సినిమాను నక్కిన త్రినాథ రావు (Nakkina Trinadha Rao) దర్శకత్వంలో నిఖిల కోనేరు నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ (Mickey J Meyer) సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లో కావ్య థాపర్ హీరోయిన్ గా నటిస్తోంది.
దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ, 'కుబేర చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. అలానే శుక్రవారం వస్తున్న 'కన్నప్ప' కూడా చక్కని విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను. సినిమాలు వరుసగా విజయం సాధించి, థియేటర్లు కళకళలాడాలి. ఈ సినిమా విషయానికి వస్తే... 'మజాకా' సినిమా షూటింగ్ కంప్లీట్ కాగానే రచయిత విక్రాంత్ శ్రీనివాస్ ఈ కథను చెప్పారు. హవీష్ కు ఇది బాగుంటుందనిపించింది. ఆయన వినిపిస్తే ఓకే చెప్పారు. చక్కని ఫ్యామిలీ వాల్యూస్ తో చిన్నపాటి సెంటిమెంట్ తో ఉండే ఫ్యామిలీ బొనాంజా మూవీ ఇది. ఇప్పటికే యాభై శాతం షూటింగ్ పూర్తయ్యింది' అని అన్నారు.
Also Read: Manchu Vishnu: కన్నప్ప కు కోపం తెప్పించకండి...
Also Read: Tv Movies: గురువారం.. తెలుగు టీవీ సినిమాలివే
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి