Jurassic World Rebirth OTT: స‌డ‌న్‌గా ఓటీటీకి వ‌చ్చి షాకిచ్చిన హాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్! కానీ వారికి మాత్ర‌మే

ABN , Publish Date - Aug 05 , 2025 | 11:23 AM

ఓటీటీ ప్రియుల‌ను అల‌రించేందుకు స‌డ‌న్‌గా లేటెస్ట్ హాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ జురాసిక్ వరల్డ్ రీబర్త్ డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది.

Jurassic World Rebirth

ఓటీటీ ప్రియుల‌ను అల‌రించేందుకు స‌డ‌న్‌గా లేటెస్ట్ హాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ జురాసిక్ వరల్డ్ రీబర్త్ (Jurassic World Rebirth) డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. ఇప్ప‌టికే ఈ జురాసిక్ పార్క్ సినిమాల‌ ఫ్రాంచైజీలో ఏడవ చిత్రంగా, 2022లో వ‌చ్చిన జురాసిక్ వరల్డ్ డొమినియన్ ఘటనల అనంత‌రం ఐదు సంవత్సరాలకు జ‌రిగిన క‌థ నేప‌థ్యంలో ఈ సినిమా తెర‌కెక్కింది. సుమారు 220 మిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా ఖ‌ర్చుతో రూపొందిన ఈ చిత్రం జూలై 2న ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. ఆపై సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకున్న‌ప్ప‌టికీ సంచ‌ల‌న క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసింది. 800 మిలియ‌న్ డాల‌ర్ల‌ను సంపాదించి రికార్డ్ సృష్టించింది.

న‌గ‌ర జీవ‌నానికి దూరంగా ఓ ఐలాండ్‌లో ఉన్న డ్రాగ‌న్స్ డీఎన్ఎతో ఖ‌రీదైన‌, అత్య‌వ‌స‌ర‌మైన మందు త‌యారు చేయ‌వ‌చ్చ‌ని ఓ బిలియ‌నీర్ ఓ హై సెక్యూరిటీ టీమ్‌ను ఏర్పాటు చేసుకుని ఆ ఐలాండ్‌కు వెళ‌తాడు. అక్క‌డ మూడు గుడ్ల‌ నుంచి డీఎన్ఏ తీసుకెళ్లే ప్ర‌య‌త్నం చేస్తాడు. ఈ క్ర‌మంలో త‌న‌తో పాటు వ‌చ్చిన ఆఫీస‌ర్ చేసిన పని వ‌ళ్ల సీన్ అంతా మారి డైనోసార్లు వేట మొద‌లు పెడ‌తాయి. దీంతో ఆ టీమ్ అక్క‌డి నుంచి ఎలా బ‌య‌ట ప‌డింది, ఏ విధంగా పోరాట్ చేయాల్సి వ‌చ్చింద‌నే పాయింట్‌తో సినిమా సాగుతుంది.

Jurassic World Rebirth

గ‌తంలో గాడ్జిల్లా(2014), రోఘ్‌, ది క్రియేట‌ర్ వంటి భారీ చిత్రాల‌ను డైరెక్ట్ చేసిన‌ గారెత్ ఎడ్వర్డ్స్ (Gareth Edwards) ఈ చిత్రానికి దర్శకత్వం వ‌హించాడు. హాలీవుడ్ అగ్ర న‌టి స్కార్లెట్ జోహన్సన్ (Scarlett Johansson), జోనాథన్ బెయిలీ (Jonathan Bailey), మహెర్షలా అలీ (Mahershala Ali) కీల‌క పాత్ర‌లో న‌టించారు. అంత‌కుముందు ఈ సిరీస్లో వ‌చ్చిన చిత్రాల‌ను మించిన‌ అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమాను తెరకెక్కించిన‌ప్ప‌టికీ యాక్ష‌న్ సీన్స్ అశించినంత‌గా లేక‌పోవ‌డంతో కాస్త నిరాశ త‌ప్ప‌దు. అంతేగాక ప్ర‌తీ సినిమాలో చూసిన క‌థ‌న‌మే అవ‌డం, రెగ్యుల‌ర్‌గా చూసిన సీన్లే చూస్తున్న‌ట్లు అనిపించ‌డం పెద్ద మైన‌స్.

ఇప్పుడీ ఈ (Jurassic World Rebirth) మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) ఓటీటీలో ఆగ‌స్టు 5 నుంచి ఇంగ్లీష్, హిందీ, తమిళం, మరియు తెలుగు భాష‌ల్లో స్ట్రీమింగ్‌కు వ‌చ్చేసింది. అయితే ప్ర‌స్తుతానికి బ‌య‌టి దేశాల‌లో మాత్ర‌మే ఈ చిత్రం అందుబాటులో ఉంది. మ‌రో వారం ప‌దిహేను రోజుల త‌ర్వాత ఇండియాలోనూ రానుంది. ఇర‌ థియేట‌ర్ల‌లో మిస్స‌యిన వారు, డైనోసర్ సినిమాలు ఇష్ట‌ప‌డే వారు, హాలీవుడ్ సినిమాలు ఇష్ట‌ప‌డే వారు ఈ చిత్రాన్ని ఓ సారి ప్ర‌య‌త్నించ‌వ‌చ్చు. అయితే మ‌న దేశంలో కొన్ని థ‌ర్డ్ పార్టీ యాప్స్, ప్రీ వెబ్‌సైట్ల‌లో ఇప్ప‌టికే ఈ సినిమా వ‌చ్చేసింది.

Updated Date - Aug 05 , 2025 | 11:23 AM