Anasuya: పెద్ది డైరెక్టర్ బుచ్చి.. నన్ను అలా పిలవమనేవాడు

ABN , Publish Date - Jul 22 , 2025 | 06:51 PM

అందాల హాట్ యాంకర్ అనసూయ (Anasuya) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Anasuya

Anasuya: అందాల హాట్ యాంకర్ అనసూయ (Anasuya) గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ (Jabardasth) ద్వారా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సినిమాల్లో కూడా బిజీ అయ్యింది. ఇక అనసూయ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే రంగస్థలమే. రామ్ చరణ్, సమంత జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రంగమత్త పాత్రలో అనసూయ నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమా హిట్ తరువాతనే టాలీవుడ్ అనసూయ బిజీగా మారింది.


తాజాగా ఒక ఇంటర్వ్యూ లో రంగమత్త పాత్ర తనకు ఎలా వచ్చిందో అనసూయ చెప్పుకొచ్చింది. ఈ పాత్ర కోసం చాలామందిని ఆడిషన్ చేశారని, ఆడిషన్ జరిగిన 3 నెలల తరువాత తనను ఫైనల్ చేసినట్లు తెలిపింది. ' రంగస్థలంలో నన్ను సెలక్ట్ చేసే సమయానికి సుకుమార్ సార్.. నేను నటించిన క్షణం సినిమా కూడా చూడలేదు. సుక్కు సార్ తో పాటు ఆ సినిమాకు ముగ్గురు రైటర్స్ పనిచేశారు.


ఇప్పుడు పెద్ది సినిమాకు డైరెక్షన్ చేస్తున్న బుచ్చిబాబు .. అప్పుడు రంగస్థలంకు ఒక రైటర్ గా పనిచేశాడు. వారితో పాటు కాశీ, శ్రీనివాస్ అని ఉండేవారు. వారు ముగ్గురు నాచేత మాయ్యా అని పిలిపించుకొనేవారు. బుచ్చి మాయ్యా.. కాశీ మాయ్యా.. శ్రీనివాస్ మాయ్యా.. వాళ్ల ముగ్గురు చాలామందిని ఆడిషన్ చేశారు. కనీసం ఒక 20 మందిని ఆడిషన్ చేశారు. చిన్నవాళ్లు.. పెద్దవారు చాలామంది ఉన్నారు. ఆ తరువాత నాకు ఆడిషన్ కు రమ్మని కాల్ వచ్చింది. నేను వెళ్లి వచ్చిన మూడు నెలల తరువాత ఓకే అని చెప్పారు. అప్పటికీ ఆశలు వదిలేసుకున్నా.. నన్నెందుకు తీసుకుంటారులే అనుకోని. తరువాత షెడ్యూల్ ఇది అని చెప్పారు. అలా రంగమత్త పాత్ర వచ్చింది' అంటూ చెప్పుకొచ్చింది.

Updated Date - Jul 22 , 2025 | 06:51 PM