Harihara Veeramallu: హరిహర వీరమల్లు.. యుఎస్ షోస్ క్యాన్సిల్?
ABN , Publish Date - Jul 22 , 2025 | 07:22 PM
మరో రెండు రోజుల్లో హరిహర వీరమల్లు విడుదల అవుతుందని సంబుర పడుతున్న సమయంలో సడన్‌గా మరో పిడుగు లాంటి వార్త కలవరపాటుకు గురి చేస్తోంది.
పవన్ కల్యాణ్ (Pawan Kalyan) హరిహర వీరమల్లు (Harihara Veeramallu) సినిమా ఏ సమయాన మొదలు పెట్టారో గానీ ఓ అడుగు ముందుకు పడితే పదడుగులు వెనక్కి అన్న చందాన పరిస్థితి ఎదురవుతుంది. ఇప్పటికే ఐదేండ్లకు పైగా చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమా ఇటీవలే ఫైనల్ షూటింగ్ జరిగి విడుదల కావాల్సిన సమయంలో వాయిదాల మీద వాయిదాలు పడుతూ చిత్ర బృందానికి ఇటు అభిమానులకు నిద్ర కరువు చేస్తోంది. గత నెల రోజులుగా ఈ సినిమా విషయంలో జరిగిన, ఎదురైన అనేక అవాంతారాలను దాటుకుని మరో రెండు రోజుల్లో సినిమా విడుదల అవుతుందని అంతా సంబుర పడుతున్న సమయంలో సడన్‌గా మరో పిడుగు లాంటి వార్త ఇప్పుడు మేకర్స్‌ను, ఫ్యాన్స్‌ను కలవరపాటుకు గురి చేస్తోంది.
ఈ హరిహర వీరమల్లు సినిమా జూలై 24 అధికారికంగా విడుదల ఉండగా కాలమానం ప్రకారం ఓ రోజు ముందే అమెరికాలో ప్రత్యేక షోలు వేయడం పరిపాటి అయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోరేపు సాయంత్రం ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ప్రదర్శనలు షెడ్యూల్ అవ్వగా ఇప్పుడు అక్కడ షోలు క్యాన్సిల్ అవనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు కంటెంట్ అక్కడకు వెళ్లకపోవడమేనని కారణమని తెలుస్తుంది. నిజానికి వారం ముందే యుఎస్ కు కంటెంట్ పంపించాల్సి ఉంటుంది. అలా కుదరకుంటే కనీసం రెండు రోజుల ముందు అయినా పంపిస్తుంటారు.
కానీ ఇప్పుడు ఇంకా డీఐ వర్క్ జరుగుతోందని రేపటికి అది కంప్లీట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు. అది ఏ టైమ్‌కు అవుతుంది. యుఎస్‌లో షోస్ పడతాయా అన్న అనుమానం మొదలైంది. ఇక రేపు సాయంత్రం తెలుగు రాష్ట్రాలలో కూడా ప్రీమియర్స్ కు అనుమతులు రావడం, టికెట్ ధరలు హైక్ కూడా వచ్చింది. ఈ పరిస్దితుల్లో ఫైనల్ కంటెంట్ సిద్దమవ్వకపోవటం ఇప్పుడు చిత్ర యూనిట్‌కు ఇబ్బందికర పరిణామంగా తయారైంది. అంతేగాక మరోపక్క ఏ.ఎం రత్నం (A.M. Rathnam)కు ఫైనాన్సియల్ టెన్షన్స్ ఇంకా పూర్తిగా తీర లేదని, ఇలాంటి సిట్యువేషన్‌లో హరిహర వీరమల్లు ప్రీమియర్స్ కొంత ఆలస్యం అవుతాయని.. కొన్ని చోట్ల క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది..
మరోవైపు.. ఈ రోజు (మంగళవారం) ఉదయమే సినిమా అడ్వాన్స్ టికెట్ల బుకింగ్స్ ఓపెన్ అవ్వగా ఓ రేంజ్‌లో టికెట్లు తెగుతున్నాయి. మెజారిటీ థియేటర్లలో ఇప్పటికే హౌస్‌ఫుల్ బోర్టులు సైతం తగిలించారు. ఎక్కడ చూసినా వీరమల్లు ఫీవరే ఉంది. మరీ అన్నీ ఆటంకాలను దాటుకుని ఈ సినిమా ఏ మేరకు ఆడియన్స్ ను ఆకట్టుకుంటుందనేది మరో రోజులోనే తేలనుంది.