సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Gulshan Devaiah: సమంతతో.. నా కెమిస్ట్రీ బాగుంటుంది

ABN, Publish Date - Dec 23 , 2025 | 06:05 PM

సమంత ప్రస్తుతం నందిని రెడ్డి దర్శకత్వంలో ‘మా ఇంటి బంగారం’. సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం దీని షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇందులో సమంత సరసన గుల్షణ్‌ దేవయ్య నటిస్తున్నారు. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో సమంత గురించి మాట్లాడారు

ఇటీవల సమంత (Samantha) రెండో పెళ్లి చేసుకున్నారు. దర్శకుడు రాజ్‌ నిడిమోరును (Raj nidimoru) ఆమె పెళ్లాడారు. ప్రస్తుతం తన సొంత బ్యానర్‌ ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ పతాకంపై నందిని రెడ్డి దర్శకత్వంలో ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram) . సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం దీని షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఇందులో సమంత సరసన గుల్షణ్‌ దేవయ్య నటిస్తున్నారు.

తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో సమంతతతో గురించి మాట్లాడారు. ‘ఈ చిత్రంలో మా ఆన్‌ స్క్రీన్ కెమిస్ట్రీ బాగుంటుంది. ఆమె దీనికి నిర్మాత అయినప్పటికీ సెట్‌లో ఎప్పుడూ నటిగానే ఉంటారు. ఈ షూటింగ్‌ ఇటీవల షురూ అయింది. సమంతతో వర్క్‌ చేయడం చాలా ఈజీ. ఈ సినిమా టీమ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను’ అని గుల్షన్‌ తెలిపారు. ‘ఓ బేబీ’ విజయం తర్వాత నందిని రెడ్డి - సమంత కాంబోలో వస్తున్న చిత్రమిది.   

Updated Date - Dec 23 , 2025 | 07:27 PM