సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Venky - Trivikram Movie: రుక్మిణీ వసంత్ కు గోల్డెన్ ఛాన్స్...

ABN, Publish Date - May 26 , 2025 | 02:53 PM

వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ చేయబోతున్న సినిమాలో కన్నడ కథానాయిక రుక్మిణీ వసంత్ ను హీరోయిన్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. దాంతో అమ్మడి గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందని టాలీవుడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేయాల్సిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు మనసు మార్చుకున్నాడు. విక్టరీ వెంకటేశ్‌ తో మూవీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. బన్నీ - అట్లీ మూవీ జూన్ లో సెట్స్ పైకి వెళ్ళనున్న నేపథ్యంలో అది పూర్తి కావడానికి ఎంత లేదన్నా మరో యేడాది పడుతుందని అంటున్నారు. అప్పటి వరకూ ఖాళీగా ఉండటం ఇష్టం లేని త్రివిక్రమ్... వెంకటేశ్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టాడట. గతంలో వెంకటేశ్ హీరోగా నటించిన 'నువ్వు నాకు నచ్చావ్', 'మల్లీశ్వరి' చిత్రాలకు త్రివిక్రమ్ కథను అందించడంతో పాటు సంభాషణలు రాశాడు. వీటికి కె. విజయ భాస్కర్ దర్శకత్వం వహించాడు. అలానే కె. కరుణాకరన్ దర్శకత్వం వహించిన 'వాసు' సినిమాకు త్రివిక్రమ్ మాటలు రాశారు. మొదటి రెండు సినిమాలు మంచి విజయాన్ని అందుకోగా... 'వాసు' వెంకటేశ్ కెరీర్ లో సమ్ థింగ్ స్పెషల్ మూవీగా నిలిచింది. అయితే... దర్శకుడిగా మెగా ఫోన్ చేతిలోకి తీసుకున్న తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంతవరకూ వెంకటేశ్ ను డైరెక్ట్ చేయలేదు. దాంతో ఇప్పుడు వచ్చిన గ్యాప్ లో వెంకటేశ్‌ తోనే మూవీ చేయాలనే నిర్ణయానికి త్రివిక్రమ్ వచ్చాడని తెలుస్తోంది.


అతి త్వరలోనే పట్టాలెక్కబోతున్న వెంకటేశ్, త్రివిక్రమ్ మూవీలో కన్నడ భామ రుక్మిణీ వసంత్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారని తెలుస్తోంది. ఆమె నటించిన కన్నడ చిత్రం 'సప్త సాగరాలు దాటి' రెండు భాగాలు తెలుగులోనూ విడుదల అయ్యాయి. అలానే నిఖిల్ హీరోగా నటించిన 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' సినిమాతో రుక్మిణీ వసంత్ టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చింది. కానీ ఈ సినిమా తీవ్ర నిరాశకు గురిచేసింది. అయితే... ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీలో రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా వచ్చే యేడాది జూన్ 25న విడుదల కాబోతోంది. కానీ ఈ లోగానే ఆమె వెంకటేశ్ సరసన నటించే సినిమా విడుదల కావచ్చునని తెలుస్తోంది. త్రివిక్రమ్, వెంకటేశ్‌ ఇద్దరూ ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ మీదనే దృష్టి పెట్టడంతో వీలైనంత త్వరగా దీనిని పట్టాలెక్కించి, విడుదల చేస్తారని అంటున్నారు. అలానే రుక్మిణీ వసంత్... తమిళంలో శివకార్తికేయన్ హీరోగా మురుగదాస్ తెరకెక్కిస్తున్న 'మదరాసి' చిత్రంలో నటిస్తోంది. ఇది తెలుగులోనూ ఈ యేడాది సెప్టెంబర్ 5న విడుదల కానుంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఏ హీరోయిన్ అయినా తొలిసారి నటించిన తర్వాత వరుసగా వారికి సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో మరో రెండు మూడు సినిమాలు చేసే ఛాన్స్ దక్కడం ఖాయమన్నది అందరికీ తెలిసిందే. ఆ రకంగా వెంకటేశ్‌ సినిమాలో త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే రుక్మిణీ వసంత్ కూడా తెలుగులో వచ్చే యేడాది మరిన్ని సినిమాలు తప్పకుండా చేస్తుందని, టాప్ పొజిషన్ లోకి ఈ అందాల భామ వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదని ట్రేడ్ పండిట్స్ అంటున్నారు.

Also Read: A22 A6: అల్లు అర్జున్‌, అట్లీ సినిమా టైటిల్ ఫిక్స్‌?.. ఇక బాక్సులు బ‌ద్ద‌లే

Also Read: Senior Stars: సీనియర్స్ రొమాన్స్ ఎబ్బెటగ్గా ఉంటోందా...

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 26 , 2025 | 02:54 PM