A22xA6: అల్లు అర్జున్‌, అట్లీ సినిమా టైటిల్ ఫిక్స్‌?.. ఇక బాక్సులు బ‌ద్ద‌లే

ABN , Publish Date - May 26 , 2025 | 01:50 PM

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ అట్లీ కాంబోలో వ‌స్తున్న‌ సినిమా నుంచి రోజుకో ఇంట్రెస్టింగ్ విష‌యం బ‌య‌ట‌కు వ‌స్తు నెట్టింట హాల్ చేస్తున్నాయి..

allu

ఐకాన్ స్టార్‌ అల్లు అర్జున్‌ (Allu Arjun), పాన్‌ ఇండియా డైరెక్టర్‌ అట్లీ (Atlee) కాంబోలో ఓ సెన్సేషనల్‌ సినిమా తెర‌కెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేష‌న్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌ల్లో ఉండ‌గా ఈ సినిమా నుంచి వ‌స్తోన్న ఆప్డేట్స్ అంతే మ్యాడ్‌గా ఉండి ఫ్యాన్స్‌కు ఓ రేంజ్‌లో థ్రిల్‌ను అందిస్తున్నాయి. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ సంద‌ర్భంగా విడుద‌ల చేసిన‌ వీడియో ఇప్ప‌టికీ ట్రెండింగ్‌లో ఉందంటే ఈ సినిమాపై క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చు.ఈ సినిమాతో తెలుగింటి అల్లుడు అట్లీ ద‌ర్శ‌రుడిగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండ‌గా సన్ పిక్చర్స్‌ పతాకంపై కళానిధి మారన్‌ (Kalanithi Maran) నిర్మిస్తున్నారు.

ఇప్ప‌టికే..ఈ చిత్రం పూర్తిగా హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ ఆధ్వ‌ర్యంలో మార్వెల్ సినిమాల త‌ర‌హాలో తెర‌కెక్కిస్తున్నార‌నే టాక్ ఉంది. ఇదిలా ఉండ‌గానే.. ఈమ‌ధ్య ఈ మూవీలో ఐదుగురు క‌థానాయిక‌ల‌కు ప్రాధాన్యం ఉండ‌డంతో దీపికా ప‌దుకుణే (Deepika Padukone), మృణాల్ ఠాగూర్ (Mrunal Thakur), జాన్వీ క‌పూర్ (Janhvi Kapoor) లు సెల‌క్ట్ చేశార‌ని, అలాగే భాగ్య శ్రీ భోర్సే (Bhagyashri Borse)తో చ‌ర్చ‌లు జ‌రుగుతుండ‌గాఇక మ‌రొక నాయిక‌ కోసం సెర్చింగ్ జ‌రుగుతుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వైర‌ల్ అయ్యాయి కూడా.

ఇప్పుడు ఇది మ‌రువ‌క ముందే ఈ సినిమా టైటిల్ విష‌యంలో ఓ న్యూస్ ఇ్ప‌పుడు నెట్టింట బాగా వైర‌ల్ అవుతోంది. అట్లీ, అర్జున్ కాంబోలో వ‌స్తున్న ఈ సినిమాకు బ‌న్నీ బిరుదు ఐకాన్ ను సినిమా టైటిల్‌గా ఫైన‌ల్ చేసిన‌ట్లు టాక్ వినిపిస్తోంది. ఇందుకు సంబంధించి సోష‌ల్ మీడియాలో పోస్టులు తెగ హాల్‌చ‌ల్ చేస్తున్నాయి. కాగా గతంలో బన్నీ వేణు శ్రీరామ్ క‌ల‌యుక‌లో చేయ‌బోయే సినిమాకు ఐకాన్ టైటిల్ అనుకున్న‌ప్ప‌టికీ అ సినిమా ముందు ప‌డ‌లేదు. కానీ ఆ టైటిల్ అర్జున్‌కు బాగా న‌చ్చ‌డంతో ఈ సినిమాకు వాడ‌నున్నార‌ని వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ప్రాజెక్ట్ A22 x A6 గా పిలవబడుతున్న ఈ చిత్రం ఫ్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఫుల్ స్వింగ్‌లో సాగుతున్నాయి. ఇందుకోసం ఇటీవ‌ల హైదరాబాద్ వ‌చ్చిన అట్లీ (Atlee) అర్జున్ (Allu Arjun)ను కలిసి ఈ చిత్రానికి సంబంధించిన చర్చల్లో పాల్గొన్నారు. జూన్‌లో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కు హీరోయిన్ల విష‌యంలో గానీ, సినిమా టైటిల్ విష‌యంలో వ‌స్తున్న వార్త‌లపై గానీ స‌ద‌రు నిర్మాణ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న అయితే రాలేదు. వాళ్లు ఏవ‌రైనా ప్ర‌క‌టించే వ‌ర‌కు ఈ వార్త‌లు ఊహాగానాల క్రిందకు వ‌స్తాయి. ఈప్ప‌టివ‌ర‌కు ఈ వార్త‌ల‌పై క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం లేదు.

Updated Date - May 26 , 2025 | 01:50 PM