సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Junior Teaser: ఆసక్తికరంగా జూనియర్ టీజర్.. హైలైట్ గా జెనీలియా

ABN, Publish Date - Jun 27 , 2025 | 07:47 PM

బడా బిజినెస్ మ్యాన్, రాజకీయనేత అయిన గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhana Reddy) తనయుడు గాలి కిరీటి (Gali Kireeti).. జూనియర్ (Junior) అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే.

Junior Teaser

Junior Teaser: బడా బిజినెస్ మ్యాన్, రాజకీయనేత అయిన గాలి జనార్దన్ రెడ్డి (Gali Janardhana Reddy) తనయుడు గాలి కిరీటి (Gali Kireeti).. జూనియర్ (Junior) అనే సినిమాతో ఎంట్రీ ఇస్తున్న విషయం తెల్సిందే. రాధా కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం బ్యానర్ పై సాయి శివాని సమర్పిస్తుండగా, రజనీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో కిరీటి సరసన శ్రీలీల (Sreeleela) నటిస్తుండగా.. బొమ్మరిల్లు హాసిని జెనీలియా (Genelia) చాలా ఏళ్ల తరువాత తెలుగుకు రీఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


తాజాగా జూనియర్ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు. కిరీటి వయస్సుకు తగ్గట్టే కాలేజ్ స్టూడెంట్ గా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక స్నేహితులే లోకం, కాలేజ్ కి వచ్చి వారిని వెతుక్కొని మంచి జ్ఞాపకాలను ఏర్పర్చుకోవాలనుకునే యువకుడు (కిరీటి). ఫ్రెండ్స్ కోసం అన్నిక్వాలిటీస్ ఉన్న ఇద్దరినీ సెలక్ట్ చేసుకొని వారికి ఆఫర్ లెటర్ కూడా పంపి మరీ ఫ్రెండ్స్ ను చేసుకుంటాడు. అలా ఆడుతూ పాడుతూ గడిపే ఆ యువకుడు లైఫ్ లోకి అదే కాలేజ్ లో చదివే అమ్మాయి (శ్రీలీల) పరిచయం అవుతుంది. చదువుకోవాలి, లైఫ్ లో ఒక గోల్ పెట్టుకోవాలి అనుకొనే తత్త్వం ఆమెది. ఇలా భిన్న ధృవాలు కలిగిన ఈ జంట ప్రేమలో పడడం చూపించారు. ఇక చివర్లో జ్ఞాపకాలే చాలు అనుకొనే హీరో.. జాబ్ కోసం ఒక కంపెనీకి వెళ్లడం.. అక్కడ లేడీ బాస్ (జెనీలియా) కలవడం చూపించారు. అసలు హీరో జాబ్ ఎందుకు చేయాల్సి వచ్చింది.. ? లేడీ బాస్ ఎవరు.. ? చివరకు హీరోహీరోయిన్ కలుస్తారా.. ? అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.


టీజర్ మొత్తం ఆద్యంతం ఆకట్టుకుంటుంది. యూత్ ఫుల్ కాలేజ్ లవ్ స్టోరీగా కనిపిస్తుంది. ఇక సినిమాకు హైలైట్ అంటే జెనీలియా అని చెప్పొచ్చు. రితేష్ ను పెళ్లాడి బాలీవుడ్ కు వెళ్లిపోయిన ఈ భామ ఇప్పటివరకు మళ్లీ టాలీవుడ్ వైపు చూడలేదు. ఇక ఇన్నేళ్ల తరువాత జెనీలియా రీఎంట్రీ ఇవ్వడం సినిమాకు ప్లస్ అని చెప్పొచ్చు. ఇక డిఎస్పీ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయనున్నాడని తెలుస్తోంది. ఈమధ్యనే కుబేరతో మంచి విజయాన్ని అందుకున్నాడు దేవి. ప్రస్తుతం ఈ టీజర్ నెట్టింట వైరల్ గా మారింది. జూలై 18 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో గాలి కిరీటి ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

Salman Khan: ఈ వయస్సులో విడాకులు తీసుకొని భార్యకు భరణం ఇవ్వలేను..

Updated Date - Jun 27 , 2025 | 07:49 PM