Salman Khan: ఈ వయస్సులో విడాకులు తీసుకొని భార్యకు భరణం ఇవ్వలేను..

ABN , Publish Date - Jun 27 , 2025 | 05:47 PM

సినిమా ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే.. ఈ మాత్రం ఆలోచించకుండా కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) అని చెప్పుకొచ్చేస్తారు.

Salman Khan

Salman Khan: సినిమా ఇండస్ట్రీలోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరు అంటే.. ఈ మాత్రం ఆలోచించకుండా కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) అని చెప్పుకొచ్చేస్తారు. అమ్మాయిల కలల రాకుమారుడు, బాలీవుడ్ లో ప్రతి హీరోయిన్ తో రిలేషన్ కలిగినవాడు.. వివాదాలకు కేరాఫ్ అడ్రెస్స్ అయిన సల్మాన్ వయస్సు ముదురుతున్నా ఇంకా పెళ్లి పీటలు ఎక్కలేదు. ఈ ఏడాది కాకపోతే వచ్చే ఏడాది. ఈ హీరోయిన్ కాకపోతే ఇంకో హీరోయిన్ అంటూ చివరకు 59 ఏళ్లవరకు వచ్చేసాడు. ఇక ఇంకెప్పుడు పెళ్లి అంటే అసలు తన జీవితంలో పెళ్లి లేదు అని క్లారిటీ ఇచ్చేశాడు.


ఈమధ్యనే సల్మాన్ ఖాన్.. కపిల్ శర్మ షోకు గెస్ట్ గా వెళ్లిన విషయం తెల్సిందే. ఈ షోలో సల్మాన్ అనేక విషయాల గురించి మాట్లాడాడు. ఇక ఎక్కడికి వెళ్లినా సల్మాన్ ను వెంటాడే ప్రశ్న.. పెళ్లి ఎప్పుడు.. ? ఇక్కడ కూడా ఆయనకు అదే ఎదురైంది. అయితే ఈసారి మాత్రం సల్మాన్ కు మౌనమే సమాధానం కాలేదు. ఎట్టకేలకు సల్మాన్ పెళ్లిపై ఓపెన్ అయ్యాడు. ఇక తన జీవితంలో పెళ్లి లేదు అని తేల్చి చెప్పేశాడు. ఈ వయస్సులో పెళ్లి చేసుకొని గొడవలు పడలేను అని చెప్పుకొచ్చాడు.


' పెళ్లి తరువాత గొడవలు వస్తాయి. భార్యాభర్తలు కొన్ని కొన్ని త్యాగాలు చేయాల్సి వస్తుంది. అక్కడ ఎంతవరకు ఒకరు భరిస్తున్నారు మనల్ని అనేది కూడా ఆలోచించాలి. ఒకవేళ పెళ్లి చేసుకొని.. మీరు ప్రశాంతంగా బెడ్ పై పడుకొని ఉండగా అర్ధరాత్రి ఒక కాలుతో మిమ్మల్ని గట్టిగా తన్ని గురక పెడితే అప్పుడేం చేయాలి. చిన్న చిన్న విషయాలు కూడా విడాకులకు దారితీస్తాయి. పోనీ, విడాకులు తీసుకొని వెళ్ళిపోతారా అంటే లేదు. సగం ఆస్తిని భరణంగా తీసుకెళ్తుంది. ఎముకలను విరగొట్టుకొని, ఎంత కష్టమైన పని చేసి, ఆరోగ్యం బాగున్నా, లేకున్నా పనిచేసి, కొత్త కొత్త వ్యాధులతో పోరాడి సంపాదించుకున్నదాంట్లో సగం ఆమెకు ఇవ్వాలి. ఒకవేళ అది చిన్న వయస్సులో పెళ్లి చేసుకుంటే.. ఈ డబ్బు అంతా మళ్లీ సంపాదించవచ్చు. కానీ, ఈ వయస్సులో మళ్లీ నేను అంత ఎఫర్ట్ పెట్టలేను' అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సల్మాన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Siddharth: స్టేజిపైనే కన్నీళ్లు పెట్టుకున్న సిద్దార్థ్..

Updated Date - Jun 27 , 2025 | 05:47 PM