సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Vishwak Sen: అక్టోబర్ 10న ‘ఫంకీ’ టీజర్

ABN, Publish Date - Oct 08 , 2025 | 05:39 PM

మొన్నటివరకు ఆ హీరో స్పీడ్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కానీ వరుస ఫ్లాపులు ఆ వేగానికి స్పీడ్ బ్రేకులు వేశాయి. ఒక్కసారిగా హీరో తెరచాటుకు వెళ్లిపోయాడు. పాత తప్పులను దిద్దుకుని... స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అంటూ విజయం కోసం విశ్వప్రయత్నం చేస్తున్నాడు.

వరుస ప్లాఫులతో చాలా వరెస్ట్ ఫేజ్ ఫేస్ చేస్తున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen). గత కొంతకాలంగా అతను చేసిన సినిమాలు చేసినట్టే పరాజయం పాలవుతున్నాయి. దీంతో అతడి సినిమాలకు స్పీడ్ బ్రేక్ పడింది. ఎలాగైనా కమ్ బ్యాక్ కావడానికి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలో తన తాజా ప్రాజెక్ట్ ‘ఫంకీ’ (Funky) పైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఎలాగైనా బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని ఫుల్ ఫోకస్‌ పెట్టాడు. ఈ సినిమా గురించి ఇప్పుడు ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.


మొన్నటిదాకా మాస్ బాట పట్టిన మాస్ కా దాస్... ఇప్పుడు కాస్త రూట్ మారుస్తున్నాడు. 'ఫంకీ' సినిమాను ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) తో బ్లాక్‌బస్టర్ కొట్టిన డైరెక్టర్ అనుదీప్ కేవీ ( K. V. Anudeep) దర్శకత్వం వహిస్తున్నాడు. దీని షూటింగ్ ఫుల్ స్వింగ్‌లో సాగుతోంది. తాజాగా ఈ చిత్ర బృందం బిగ్ అప్‌డేట్ డ్రాప్ చేసింది. ‘ఫంకీ’ టీజర్ ఈ నెల 10న రాబోతున్నట్టు ప్రకటించింది.

'ఫంకీ' సినిమాలో హీరోయిన్‌గా కయద్ లోహర్ (Kayadu Lohar) నటిస్తోందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ ఆ విషయాన్ని మేకర్స్ ఇంకా సస్పెన్స్‌లో ఉంచారు. టీజర్‌ వస్తే కానీ ఆ సీక్రెట్ బయటపడేలా లేదు. భీమ్స్ (Bheems) సంగీతం అందిస్తున్న ఈ సినిమా విశ్వక్ సేన్‌కీ, అనుదీప్ కీ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ కాబోతోందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ బిగ్ బడ్జెట్ మూవీ వచ్చే ఏడాది థియేటర్లలో సందడి చేయనుంది. విశ్వక్ అభిమానులకు ‘ఫంకీ’ ఓ మాస్ మసాలా ఫీస్ట్ అవుతుందని, ఈ సినిమాతో విశ్వక్ తిరిగి ఫామ్ లోకి వచ్చేస్తాడని అంతా భావిస్తున్నారు.
Read Also: Tollywood: మురళీ మోహనా... మజాకా...

Read Also: Nayanthara: షాకింగ్.. నయనతార ఇంటికి బాంబు బెదిరింపులు

Updated Date - Oct 08 , 2025 | 05:39 PM