VISA: ముచ్చటగా అశోక్ గల్లా మూడో సినిమా...

ABN , Publish Date - Jul 11 , 2025 | 01:42 PM

మూడేళ్ళ క్రితం 'హీరో' సినిమాలో ఎంట్రీ ఇచ్చిన అశోక్ గల్లా తాజా చిత్రం 'వీసా'. వింటారా సరదాగా అనేది దీని ట్యాగ్ లైన్. ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

సూపర్ స్టార్ కృష్ణ (Krishna) మనవడు, ప్రిన్స్ మహేశ్ బాబు (Mahesh Babu) మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) పట్టువదలని విక్రమార్కుడిలా చక్కని విజయం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తున్నాడు. 'హీరో' (Hero) సినిమాతో మూడేళ్ళ క్రితం హీరోగా ఎంట్రీ ఇచ్చిన అశోక్ గల్లా గత యేడాది రెండో సినిమా 'దేవకీ నందన వాసుదేవ' చేశాడు. ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా పెద్దంత విజయాన్ని సాధించలేదు.


ఇప్పుడు అశోక్ గల్లా హీరోగా సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఓ సినిమాను నిర్మిస్తోంది. ఉద్థవ్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాకు తాజాగా 'వీసా - వింటారా సరదాగా' (VISA Vintara Saradaga) అనే పేరు పెట్టారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. శనివారం దీనికి సంబంధించిన టీజర్ విడుదల కానుంది. వినోదం, ప్రేమ, భావోద్వేగాలతో నిండిన ఓ సరికొత్త యూత్‌ఫుల్ రైడ్‌ను వాగ్దానం చేస్తున్నట్టుగా ఈ ఫస్ట్ లుక్ ఉంది. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రం... విదేశాలలో చదువుతున్న భారతీయ విద్యార్థుల జీవితాలను, వారి కలలను, సందిగ్ధతలను, స్నేహాలను, మధుర క్షణాలను ప్రేక్షకుల మనసుకి తాకేలా చూపించనుందని ఈ పోస్టర్ చూస్తే అర్థమౌతోంది. ఈ సినిమాలోఅశోక్ గల్లా సరసన శ్రీగౌరీ ప్రియ (Sri Gouri Priya) నాయికగా నటిస్తోంది. రాహుల్ విజయ్ (Rahul Vijay), శివాత్మిక రాజశేఖర్ (Shivathmika Rajasekhar) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. హృద్యమైన కథతో రూపొందుతోన్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్ టైనర్ ను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ (Suryadevara Naga Vamsi), సాయి సౌజన్య (Sai Soujanya) నిర్మిస్తున్నారు. 'VISA - వింటారా సరదాగా' ప్రపంచంలోకి ప్రేక్షకులకు తీసుకెళ్లేలా ఈ చిత్రం టీజర్ ఉంటుందని, కడుపుబ్బా నవ్వించే హాస్యంతో పాటు, హృదయాన్ని హత్తుకునే డ్రామాను ఈ చిత్రంలో చూడొచ్చని వారంటున్నారు.

Also Read: Pawan Sentiment: వీరమల్లుకు తొలి ప్రేమ సెంటిమెంట్

Also Read: Son Of Sardaar 2: అజ‌య్ దేవ‌గ‌ణ్.. స‌న్ ఆఫ్ స‌ర్దార్‌ 2 ట్రైల‌ర్‌

Updated Date - Jul 11 , 2025 | 01:50 PM