Pawan Sentiment: వీరమల్లుకు తొలి ప్రేమ సెంటిమెంట్
ABN , Publish Date - Jul 11 , 2025 | 01:33 PM
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' త్వరలోనే జనం ముందుకు రాబోతోంది... ఈ సినిమాపై రోజు రోజుకూ పవన్ ఫ్యాన్స్ లో అంచనాలు పెరుగుతున్నాయి... ఈ నేపథ్యంలోనే పవన్ కు అచ్చివచ్చిన ఓ అంశాన్ని అభిమానులు గుర్తు చేసుకుని ఆనందిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ (pawan kalyan) కెరీర్ ను పరిశీలిస్తే ఆయనకు బంపర్ హిట్స్ అందించిన నెలలుగా ఏప్రిల్, జూలై మాసాలు నిలుస్తాయి... ఏప్రిల్ లో పవన్ నటించిన "బద్రి (Badri), ఖుషి (Kushi) , జాని ( Johny ), జల్సా (Jalsa)" సినిమాలు రిలీజ్ అయ్యాయి... వీటిలో 'జాని' మినహాయిస్తే అన్నీ పవన్ కు సూపర్ హిట్స్ చూపిన చిత్రాలే... పవన్ కు ఎక్కువ సక్సెస్ రేటును అందించిన మాసంగా ఏప్రిల్ నిలుస్తుంది... అయితే పవన్ కెరీర్ నే ఓ మలుపు తిప్పిన చిత్రంగా 'తొలిప్రేమ' (Tholiprema)ను చెప్పుకోవచ్చు... ఈ సినిమా 1998 జూలై 24వ తేదీన విడుదలయింది... ఇప్పుడు అదే తేదీకి 'హరి హర వీరమల్లు' వస్తోంది... 27 సంవత్సరాల తరువాత 'తొలిప్రేమ' రిలీజైన జూలై 24వ తేదీనే 'వీరమల్లు' రాక అభిమానుల అంచనాలను అంబరమంటేలా చేస్తోంది...
పవన్ కళ్యాణ్ తొలి మూడు చిత్రాలలో రెండు భలేగా అలరించాయి... అయితే పవన్ హీరోగా రూపొందిన నాల్గవ సినిమాగా 'తొలిప్రేమ' అరుదెంచింది... పవన్ కు డైరెక్ట్ 200 డేస్ సినిమాగా నిలచింది... ఇంత అరుదైన రికార్డ్ ను నమోదుచేసిన 'తొలిప్రేమ' అన్నా, ఆ సినిమా రిలీజయిన జూలై 24వ తేదీ అన్నా ఫ్యాన్స్ కు ఎంతో అభిమానం... ఆ తరువాత 1999 జూలై 15 న పవన్ కళ్యాణ్ 'తమ్ముడు (Thammudu)' వచ్చింది... ఇది కూడా యూత్ ను విశేషంగా ఆకర్షించింది... ఆ పై తన అన్న చిరంజీవితో కలసి పవన్ నటించిన 'శంకర్ దాదా జిందాబాద్ (Shankar Dada Zindabad )' 2007 జూలై 27న విడుదలయింది... అటుపై తన మేనల్లుడు సాయి దుర్గ్ తేజ్ ( Sai Durga Tej ) తో పవన్ స్క్రీన్ షేర్ చేసుకున్న 'బ్రో' (Bro)2023 జూలై 28న విడుదలయింది... పవన్ సోలో హీరోగా నటించిన చిత్రాలు జూలైలో విడుదలై విజయఢంకా మోగించాయి... తరువాత జూలైలో వచ్చిన సినిమాల్లో ఓ దాంట్లో అన్నతోనూ, మరో సినిమాలో మేనల్లుడితోనూ కలసి పవన్ నటించారు.. అవి మునుపటి స్థాయిలో అలరించలేదు... అయితే మళ్ళీ జూలై నెలను ఎంచుకొని ఇప్పుడు 'హరిహర వీరమల్లు' 24న ప్రేక్షకుల ముందుకు వస్తోంది... పవన్ సోలో హీరోగా రూపొందిన 'వీరమల్లు' విజయం సాధిస్తుందని అభిమానుల నమ్మకం...
కొన్ని నెలలు - కొన్ని తేదీలు టాప్ స్టార్స్ ఫ్యాన్స్ ను ఊరిస్తూ ఉంటాయి... కొందరు అలాంటి సెంటిమెంట్స్ ను కొట్టి పారయేవచ్చు... కానీ, కొన్ని సార్లు అవి నిజమవుతూ ఉంటాయి... ఈ రీతిన ఎందరో టాప్ స్టార్స్ కు కలసి వచ్చిన తేదీలు, నెలలు ఉన్నాయి... అదే తీరున పవన్ కళ్యాణ్ కు కూడా జూలై 24వ తేదీ కలసి వస్తుందని అభిమానుల అభిలాష... సరిగా 27 ఏళ్ళ క్రితం జూలై 24న విడుదలైన 'తొలిప్రేమ' ఈ నాటికీ పవన్ సినిమాల్లో ఓ స్పెషల్ గా నిలచింది... ఆ మధ్య రీరిలీజ్ లోనూ 'తొలిప్రేమ' అభిమానులను ఆకట్టుకుంది... అలాగే పవన్ తొలిసారి నటించిన పీరియడ్ మూవీగా వస్తోన్న 'హరి హర వీరల్లు' కూడా అదే తేదీన విడుదలై విజయఢంకా మోగిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు... మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు వస్తున్న 'హరిహర వీరమల్లు' ఏ స్థాయిలో అలరిస్తుందో చూద్దాం...