Shah Rukh Khan King: కొత్త లుక్‌లో.. షారుఖ్! ‘కింగ్’ గ్లింప్స్ వచ్చేసింది
ABN , Publish Date - Nov 02 , 2025 | 12:39 PM
షారుఖ్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ‘కింగ్’ టైటిల్ గ్లింప్స్ విడుదలైంది. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ యాక్షన్ సినిమా 2026లో భారీగా విడుదల కానుంది.
ప్రపంచవ్యాప్తంగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) అభిమానులకు నవంబర్ 2 ప్రత్యేక దినం. ప్రతి ఏడాది ఈ రోజున ఆయన పుట్టినరోజును అంబరాన్నంటేనా సెలబ్రేట్ చేస్తారు. ఈసారి మాత్రం ఫ్యాన్స్ ఆనందాన్ని మరింత రెట్టింపు జేస్తూ.. మరింత భారీ సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఆయన రాబోయే యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘కింగ్’ (King) నుంచి టైటిల్ గ్లింప్స్‌ని చిత్రబృందం విడుదల చేసింది.
నిమిషం 11 సెకండ్ల నిడివి గల ఈ గ్లింప్స్‌లో షారుఖ్ కొత్త లుక్‌లో కనిపించారు. బైక్స్ దూసుకెల్లడం,, గన్ ఫైట్స్, ఫైర్ సీక్వెన్స్‌లు, షారుఖ్ డైలాగ్ డెలివరీ దిరిపోయాయి. ఈ వీడియో వచ్చిన క్షణాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది. దీనిని చూసిన ఫ్యాన్స్ మాత్రం “ఇది కేవలం గ్లింప్స్ మాత్రమే.. ట్రైలర్ వస్తే మాస్ బ్లాస్ట్ గ్యారంటీ” అంటున్నారు. మరికొంతమంది షారుఖ్ లుక్ వరస్ట్‌గా ఉందని, గ్లిమ్స్ పరమ రోటీన్‌గా ఉందని, ఆకట్టుకునేలా లేదని అనేక మంది పెదవి విరుస్తున్నారు.
రెండేండ్ల క్రితం షారుఖ్‌తోనే ‘పఠాన్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ (Red Chillies Entertainment) ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది.

ప్రస్తుతం ప్రీ–ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ ‘కింగ్’ చిత్రం షూటింగ్ వచ్చే ఏడాది ఆరంభమవుతుందని, 2026 చివర్లో థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, స్టంట్ డిజైన్, మ్యూజిక్ – అన్ని విభాగాల్లోనూ పెద్ద బడ్జెట్‌తో రూపొందుతున్న సినిమా ఇది.
షారుఖ్ బర్త్‌డే రోజున ముంబైలో ఆయన ఇంటి ముందు వేలాది మంది అభిమానులు గుమికూడగా, అదే సమయంలో ‘కింగ్ గ్లింప్స్’ విడుదల కావడం డబుల్ సెలబ్రేషన్‌గా మారింది. సోషల్ మీడియాలో #KingGlimpse, #ShahRukhKhan, #HappyBirthdaySRK హ్యాష్‌ట్యాగ్‌లు టాప్ ట్రెండ్‌గా మారాయి.