Deekshith Shetty: 'ది గర్ల్ ఫ్రెండ్' వెనుకే మరో సినిమా...
ABN , Publish Date - Nov 03 , 2025 | 03:35 PM
దీక్షిత్ శెట్టి నటించిన రెండు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్నాయి. అతను హీరోగా నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' తెలుగులో నవంబర్ 7న, కన్నడ లో నవంబర్ 14న విడుదల అవుతోంది. అలానే నవంబర్ 21న తెలుగు, కన్నడ భాషల్లో మరో సినిమా 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మీ' రాబోతోంది.
యంగ్ టాలెంటెడ్ యాక్టర్ దీక్షిత్ శెట్టి (Deekshit Shetty) కి తెలుగులో 'దసరా' (Dasara) మూవీ మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. నిజానికి దానికంటే ముందు కూడా రెండు మూడు చిత్రాలలో దీక్షిత్ శెట్టి నటించాడు. ఇప్పుడు అతను హీరోగా నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' (The Girlfriend) మూవీ ఈ నెల 7న రాబోతోంది. విశేషం ఏమంటే... దీని తర్వాత రెండు వారాల్లోనే అతని మరో సినిమా 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మీ' (Bank of Bhagyalaxmi) విడుదల అవుతోంది. కన్నడలో రూపుదిద్దుకున్న ఈ సినిమాను తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని దీక్షిత్ శెట్టి తెలిపారు. అభిషేక్ ఎం దర్శకత్వంలో తెరకెక్కిన 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి'లో బృందా ఆచార్య హీరోయిన్ గా నటించింది. శ్రీదేవి ఎంటర్ టైనర్స్ బ్యానర్ పై హెచ్.కె. ప్రకాశ్ దీన్ని నిర్మించారు.
ఇప్పటికే విడుదలైన సాంగ్, టీజర్ నెటిజన్స్ ను బాగా ఆకట్టుకుంటున్నాయి. బ్యాంక్ దోపిడీకి వెళ్ళిన హీరో గ్యాంగ్ కి అక్కడ కేవలం 67 వేల రూపాయిలు మాత్రమే దొరుకుతాయి. తర్వాత ఎలాంటి పరిస్థితులు వారికి ఎదురయ్యాయి అనేది ఎంటర్ టైనింగ్ గా టీజర్ లో ప్రజెంట్ చేశారు. దీన్ని చూస్తే దీక్షిత్ శెట్టి, బృందా ఆచార్య మధ్య కెమిస్ట్రీ పర్ ఫెక్ట్ గా సెట్ అయినట్టే అనిపిస్తోంది. జుధాన్ శాండీ సంగీతం అందించిన 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మీ'కి అభిషేక్ జె డీవోపీగా వర్క్ చేశారు. ఇతర ప్రధాన పాత్రలను గోపాల్ కృష్ణ దేశ్ పాండే, సాధు కోకిల, శ్రుతి హరిహరన్ పోషించారు.

చిత్రం ఏమంటే... దీక్షిత్ శెట్టి నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా నవంబర్ 7న కేవలం తెలుగు, హిందీ భాషల్లో వస్తోంది. కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో నవంబర్ 14న విడుదల చేస్తారు. సో... అతని స్వరాష్ట్రమైన కర్ణాటకలో 'ది గర్ల్ ఫ్రెండ్' నవంబర్ 14న విడుదల అవుతుంటే ఆ తర్వాత వారమే 'బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మీ' వస్తుందన్నమాట. సో... బ్యాక్ టూ బ్యాక్ దీక్షిత్ శెట్టి సినిమాలు జనం ముందుకు రాబోతున్నాయి.
Also Read: The Paradise: నాని తల్లిగా.. బాలీవుడ్ బ్యూటీ! 'ఎల్లమ్మ' తర్వాత.. మరోసారి తెలుగులో
Also Read: RGV: వామ్మో రాంగోపాల్ వర్మా.. ఏందయ్యా ఇది! మళ్లీ ఏం.. ఫ్లాన్ చేశావయ్యా