సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Maheshbabu Little Hearts: సూపర్ స్టార్ టచ్‌.. ‘లిటిల్ హార్ట్స్’కి బిగ్ బూస్ట్

ABN, Publish Date - Sep 17 , 2025 | 05:56 PM

సగటు ప్రేక్షకుల్లోనే కాదు - సినీజనంలోనూ స్టార్ హీరోస్ కు బిగ్ ఫ్యాన్స్ ఉంటారు.. తమ అభిమాన హీరోల మనసు గెలిస్తే.. నిజంగా విజయం సాధించినట్టేనని ఫీలైపోతారు. అలాంటి ఫ్యాన్ మూమెంట్ దక్కిన ఓ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ గాల్లో తేలిపోతున్నాడు.

చిన్న బడ్జెట్ సినిమాగా వచ్చి బాక్సాఫీస్‌ వద్ద సంచలన విజయం సాధించింది 'లిటిల్ హార్ట్స్' (Little Hearts) మూవీ. రూ. 2.4 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం 10 రోజుల్లో రూ. 32 కోట్లు వసూళ్ళు చేసి.. రెండో వారంలోనూ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఇప్పటికే స్టార్ హీరోలు అల్లు అర్జున్ (Allu Arjun), నాని (Nani), విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) లాంటి హీరోస్ సోషల్ మీడియా వేదికగా ప్రశంసించారు. సక్సెస్ మీట్ లోనూ సినిమా యూనిట్ ని అభినందనలతో ముంచెత్తారు. అయితే తాజాగా మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ఈ సినిమా విషయంలో చోటు చేసుకుంది.


'లిటిల్ హార్ట్స్' కు సంగీతం అందించిన సింజిత్ ఎర్రమల్లి (Sinjith Yerramilli) సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) కు వీర ఫ్యాన్‌. ఈ క్రమంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన అభిమాన హీరో మహేశ్ ఈ సినిమా చూసి ట్వీట్ చేయాలని కోరాడు. ఒకవేళ మహేశ్ ట్వీట్ చేస్తే.. ఆ ఆనందం తట్టుకోలేక, ఫోన్ ఆఫ్ చేసి వెళ్లిపోతా అంటూ ఎమోషనల్ గా చెప్పాడు. ఆ కోరిక వైరల్ కాగా, మహేశ్ కూడా సినిమా చూసి ఎక్స్‌లో తన రివ్యూ పోస్ట్ చేశారు: "లిటిల్ హార్ట్స్ సరదాగా, ఫ్రెష్‌గా ఉంది. యంగ్ స్టార్స్ అదరగొట్టారు... సింజిత్, ఫోన్ ఆఫ్ చేసి వెళ్లొద్దు, నీవు బిజీ అవుతావు.. స్టార్ అవుతావంటూ ట్వీట్ చేయగా వైరల్ గా మారింది.

ఇక మహేశ్ చేసిన ట్వీట్ చూసి చిత్ర బృందం ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. సింజిత్ (Sinjith ) , డైరెక్టర్ సాయి మార్తాండ్ (Sai Marthand), హీరోయిన్ శివానీ నాగారం (shivani nagaram) , హీరో మౌళి (Mouli ) ఆనందంతో రిప్లైలు ఇచ్చారు. సింజిత్ "నేను ఎక్కడికీ వెళ్లను అన్నా" అంటూ వీడియో పోస్ట్ చేశాడు. మహేశ్ సపోర్ట్‌తో ఈ సినిమాకు మరింత బూస్ట్ అందింది. చూస్తుంటే మరిన్ని రికార్డులు బద్దలు కొట్టేలా ఉంది.

Read Also: Rishab Shetty: 'కాంతార' ప్రివ్యూస్.. పండగ ముందు ఫస్ట్ షో

Read Also: Siddhu Jonnalagadda: 'జాక్' దెబ్బ‌.. సిద్థుకు త‌త్వం బోధ‌ ప‌డిందా!

Updated Date - Sep 17 , 2025 | 06:34 PM