సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: సినీ కార్మికుల సమ్మెకు 'శుభమ్' కార్డ్ పడినట్టేనా...

ABN, Publish Date - Aug 09 , 2025 | 07:38 PM

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో వేతనాల పెంపుపై సినీకార్మికులు చేస్తున్న సమ్మెకు ముగింపు పలికే దిశగా అడుగులు పడుతున్నాయి. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ సమావేశమై కార్మికుల వేతనాల పెంపు విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు.

Telugu Film Chamber

గత కొద్ది రోజులుగా టాలీవుడ్ లో వేతనాల పెంపుపై సినీకార్మికులు చేస్తున్న సమ్మెకు ముగింపు పలికే దిశగా అడుగులు పడుతున్నాయి. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ సమావేశమై కార్మికుల వేతనాల పెంపు విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నారు. తత్ఫలితంగా సినీవర్కర్స్ కోరుకున్న తీరున 30 శాతం వేతనాల పెంపు కాకుండా, విడతల వారీగా 25 శాతం మేర పెంపు జరగనుంది. ఆ పెంపు కూడా రెండు వేల రూపాయల వేతనం అందుకొనేవారికే వర్తించనుంది.


రోజుకు రూ.2000 తీసుకొనే కార్మికులకు మొదటి సంవత్సరం 15 శాతం వేతన పెంపు జరుపుతామని, తరువాత రెండో సంవత్సరంలో మరో ఐదు శాతం, మూడో సంవత్సరం ఇంకో ఐదు శాతం పెంచుతామని, అలా మొత్తం మూడేళ్ళలో 25 శాతం వేతన పెంపు లభిస్తుందని యాక్టివ్ ప్రొడ్యూసర్స్ సమావేశ అనంతరం ఫిలిమ్ ఛాంబర్ సెక్రటరీ దామోదర ప్రసాద్ మీడియాకు తెలిపారు. ఇదిలా ఉంటే రోజుకు రూ.1000 వేతనం అందుకొనే కార్మికులకు మొదటి సంవత్సరం 20 శాతం పెంపు, రెండో సంవత్సరం ఏమీ ఉండదని, మూడో సంవత్సరం ఐదు శాతం పెంపు లభిస్తుందన్నారు. దాంతో వారికి సైతం 25 శాతం పెంపు అందినట్టే అవుతుంది. అయితే చిన్న సినిమాలకు ఎలాంటి పెంపు ఉండబోదనీ స్పష్టం చేశారు దామోదర ప్రసాద్. మరి ఏ బడ్జెట్ లోపు సినిమా నిర్మిస్తే దానిని చిన్న చిత్రంగా పరిగణిస్తారు అన్న ప్రశ్నకు ఆ విషయంపై నిర్మాతలందరూ చర్చించాక ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ పెంపుదల కూడా తాము పెట్టిన నాలుగు షరతులకు సినీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వారు అంగీకరిస్తేనే అమలు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. మరి నిర్మాతల ఆఫర్ కు ఫెడరేషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read: Aamir Khan: రాఖీ రోజున అన్నపై సంచలన ఆరోపణలు చేసిన ఆమీర్ సోదరుడు

Also Read: Federation Bandh: ఆ వార్తలు నమ్మోద్దంటున్న చిరు

Updated Date - Aug 09 , 2025 | 07:38 PM