Film Chamber Elections: బైలా ప్రకారమే ఎన్నికలు జరగాలి

ABN , Publish Date - Jul 08 , 2025 | 04:37 AM

తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు ఎన్నుకున్న ప్రస్తుత కమిటీ గడువు ఈ నెలలోనే ముగియనుంది.

  • మెమొరాండం సమర్పించిన నిర్మాతలు

‘‘తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌కు ఎన్నుకున్న ప్రస్తుత కమిటీ గడువు ఈ నెలలోనే ముగియనుంది. వెంటనే ఎలక్షన్లు జరగడానికి వీల్లేకుండా ప్రస్తుత అసోసియేషన్‌లోని కొందరు సభ్యులు ఎన్నికలను వాయిదాకు ప్రయత్నిస్తున్నారు’’ అని తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఛైర్మన్‌ డా.ప్రతాని రామకృష్ణ గౌడ్‌ పేర్కొన్నారు. సోమవారం ఫిల్మ్‌ ఛాంబర్‌లో డా.ప్రతాని రామకృష్ణ గౌడ్‌, బసిరెడ్డి ఆధ్యర్వంలో ఓ సమావేశం నిర్వహించారు. బై లా ప్రకారమే ఎన్నికలు జరగాలని నాలుగు సెక్టార్స్‌కు చెందిన 60 మంది నిర్మాతలు మెమొరాండం సమర్పించారు.

అందుకే వాయిదా: దామోదర ప్రసాద్‌

ఈ విషయంపై ఫిల్మ్‌ ఛాంబర్‌ సెక్రటరీ దామోదర ప్రసాద్‌ వివరణనిచ్చారు. ‘‘సాధారణంగా ఈ నెలాఖరుకు ఎన్నికలు జరగాలి. అయితే ముఖ్యమైన సమస్యలను పరిష్కరించాల్సి ఉంది. అలాగే కొన్ని పనులు మధ్యలోనే ఉన్నాయి. అందుకే ఈసీ మీటింగ్‌లో మరో ఏడాది పాటు గడువును పొడిగించాలని కోరాను. ఈసీ మీటింగ్‌ పెట్టినప్పుడు అందరూ రావాలి. వారి అభిప్రాయాలు చెప్పాలి’ అని పేర్కొన్నారు.

Updated Date - Jul 08 , 2025 | 04:37 AM