సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం న్యూ లుక్.. ఆయన ధరించిన చెప్పుల ధర ఎంతో తెలుసా.. ?

ABN, Publish Date - Jun 22 , 2025 | 09:05 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ఇది పేరు మాత్రమే కాదు. ఒక బ్రాండ్.

Pawan Kalyan

Pawan Kalyan:  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. ఇది పేరు మాత్రమే కాదు. ఒక బ్రాండ్. ఆయన ఏం చేసినా సెన్సేషన్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం ఒకపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా కూడా ఆయన మాట ఇచ్చిన సినిమాలను ఫినిష్ చేసే పనిలో పడ్డాడు.  ప్రస్తుతం  పవన్ నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bahagat Singh). హరీష్ శంకర్(Harish Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా  విజయ్ నటించిన తేరి సినిమాకు రీమేక్ అని తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల(Sreeleela) నటిస్తోంది. 


పవన్ కు పదవి వచ్చాకా ఈ సినిమా షూటింగ్ మధ్యలోనే ఆగిపోయింది. ఇక చాలా గ్యాప్ తరువాత పవన్ ఉస్తాద్ సెట్ లోకి అడుగు పెట్టాడు.  ఒకపక్క ఏపీ డిప్యూటీ సీఎం గా విధులను నిర్వర్తిస్తూనే  ఇంకోపక్క షూటింగ్ లో పాల్గొంటున్నాడు. సినిమాలు లేనప్పుడు పవన్ చాలా సింపుల్ గా కనిపిస్తాడు. వైట్ అండ్ వైట్ డ్రెస్, నెరిసిన జుట్టు.. మెడలో ఎర్రతాడు.. వీటితోనే ఎక్కువ కనిపిస్తాడు. కానీ, షూటింగ్ సమయంలో మాత్రం హీరోగా మారిపోతాడు. ఈ మధ్యనే పవన్ బరువు కూడా తగ్గడంతో మరింత హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. 


తాజాగా పవన్ న్యూ లుక్ లో అదరగొట్టేశాడు. వైట్ అండ్ వైట్ పంచె, షర్ట్ పై బ్లాక్ గాగుల్స్ తో విమానం దిగి నడుచుకుంటూ వస్తున్న పవన్ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇక ఈ ఫోటోలో ఫ్యాన్స్ అందరి చూపు పవన్ చెప్పులు పై పడింది. సాధారణంగా సెలబ్రిటీలు ధరించే దుస్తులు, చెప్పులు,  వాచ్ లు అన్ని ఖరీదుగానే ఉంటాయి. లక్షలు పెట్టి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ను కొనుగోలు చేస్తారు.


టాలీవుడ్ లో ఎన్టీఆర్, మహేష్ బాబు, నాగార్జున.. ఇలా కొంతమంది మాత్రం బ్రాండ్స్ లేకుండా బయటకు రారు. ఎంత సింపుల్ గా కనిపించినా  కూడా వాటి ధర వింటే గుండెలు జారిపోతాయి. ఇక పవన్ చెప్పులు కూడా అన్ని లక్షల్లో ఉంటాయి అనుకుంటే పొరపాటే. ఈ ఫొటోలో పవన్ వేసుకున్న చెప్పులు... నిక్ కామ్ బ్రాండ్ కు చెందినవి.వీటి ధర  రూ. 7 వేలు. ఏంటి నిజమా అంటే.. అవును నిజమే. కొద్దిగా సంపాదించేవారు  అయితే కొనేయొచ్చు. ఇక ఈ ధర చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. 


ఒక స్టార్ హీరో, డిప్యూటీ సీఎం అయిన పవన్ ఇంత తక్కువ ధర ఉన్న చెప్పులను వాడుతున్నాడా.. ? అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే  పవన్ సింప్లిసిటీ గురించి అందరికీ తెల్సిందే. ఇప్పుడైనా ఈ ఏడు వేలు ఖరీదు చేసే చెప్పులు ధరించాడు. ప్రచార సమయంలో  కానీ, మొన్నీమధ్య తిరుపతి లడ్డూ వివాద సమయంలో అయితే ప్యారగాన్ చెప్పులు వేసుకొని కనిపించాడు. ప్రస్తుతం పవన్ చెప్పుల  ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. 

Malavika Mohanan: అరుదైన అవార్డును అందుకున్న రాజాసాబ్ బ్యూటీ 

Updated Date - Jun 22 , 2025 | 09:05 PM