Malavika Mohanan: అరుదైన అవార్డును అందుకున్న రాజాసాబ్ బ్యూటీ 

ABN , Publish Date - Jun 22 , 2025 | 07:52 PM

మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) అరుదైన అవార్డును  అందుకుంది.

Malavika Mohanan

Malavika Mohanan: మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ (Malavika Mohanan) అరుదైన అవార్డును  అందుకుంది. ముంబైలో జరిగిన ఐడబ్ల్యూఎంబజ్ డిజిటల్ అవార్డ్స్ లో పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ గా అవార్డును దక్కించుకుంది. ఐడబ్ల్యూఎంబజ్ డిజిటల్ అవార్డ్స్.. ఓటీటీ, వెబ్ ఎంటర్ టైన్ మెంట్ కు సంబంధించిన బిగ్గెస్ట్ అవార్డ్స్ గా ఈ సంస్థకు పేరుంది.  ఇక ఈ అవార్డును అందుకున్న మాళవిక.. తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంది.  ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఐడబ్ల్యూఎంబజ్ డిజిటల్ అవార్డ్స్ బృందానికి ధన్యవాదాలు తెలిపింది. అంతేకాకుండా  తనను ఇంత గ్లామర్ గా చూపించడం తో పాటు ఆ వేడుక మొత్తం  తనను ఎంతో సరదాగా, మరింత ఫన్  గా  ఉంచిన తన టీమ్ కు పెద్ద హాగ్ ఇస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం మాళవిక ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. 


మాళవిక మోహనన్ గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ KV గుహన్  కుమార్తెగా మాళవిక ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే సొంతగడ్డపై విజయాన్ని అందుకోలేకపోయిన మాళవిక తమిళ్ లో విజయ్ సరసన మాస్టర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ గా మారింది. ఆ తరువాత ధనుష్, విక్రమ్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 


ఇక ది రాజాసాబ్ సినిమాతో మాళవిక  తెలుగుకు పరిచయం కానుంది. ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మారుతీ దర్శకత్వం వహిస్తున్నాడు.  ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంలో మాళవికతో పాటు నిధి అగర్వాల్, రిద్ది కుమార్ కూడా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్ లో మాళవిక హైలైట్ గా కనిపించింది. 


రాజాసాబ్ అనౌన్స్ చేసినప్పటి నుంచి అందులో హీరోయిన్ గా మాళవిక పేరు వినిపిస్తూనే ఉంది. ఇక ఎప్పుడైతే ఆమె సినిమాలో ఉంది అని తెలిసిందో ప్రభాస్ ఫ్యాన్స్.. ఆమెను ఫాలో అవ్వడం మొదలుపెట్టారు. నిత్యం హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాను హిట్టేక్కిస్తూ ఉండే మాళవికకు రాజాసాబ్ హిట్ ను ఇస్తుందో లేదో చూడాలంటే డిసెంబర్ 5 న ఆ సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే. 

 Rashmika Mandanna: కుర్ర హీరోయిన్స్ .. రశ్మికను చూసి నేర్చుకోండి 

Updated Date - Jun 22 , 2025 | 07:52 PM