Divi Vadthya:  మంగ్లీ బర్త్ డే పార్టీపై క్లారిటీ ఇచ్చిన దివి!

ABN , Publish Date - Jun 11 , 2025 | 04:50 PM

ఫోక్ సింగర్ మంగ్లీ(Mangli) పుట్టినరోజు వేడుకలు టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్నాయి.

Divi Vadthya

Divi Vadthya: ఫోక్ సింగర్ మంగ్లీ(Mangli) పుట్టినరోజు వేడుకలు టాలీవుడ్ లో కలకలం సృష్టిస్తున్నాయి. గత రాత్రి  చేవెళ్ల స‌మీపంలోని ఈర్లపల్లి త్రిపుర రిసార్ట్‌లో జరిగిన  ఆమె బర్త్ డే వేడుకల్లో గంజాయి, విదేశీ మద్యం ఉపయోగించారని పోలీసులు నిర్దారించారు. ఈ వేడుకలో ఇండస్ట్రీకి సంబంధించిన వారు 50 మంది పాల్గొనగా వారందరికీ డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా .. 9 మంది గంజాయి తీసుకున్నారని తేలింది. దీంతో వెంటనే మంగ్లీ మీద కేసు నమోదు చేశారు.

 Singer Mangli: బ‌ర్త్‌డే పార్టీలో డ్ర‌గ్స్ క‌ల‌క‌లం.. సింగ‌ర్ మంగ్లీపై కేసు

ఇక ఈ వేడుకలో సినీ పరిశ్రమకు చెందిన దివి(Divi Vadthya), కాసర్ల శ్యామ్, రచ్చ రవి, సింగర్ ఇంద్రావతి వంటి పలువురు పాల్గొన్నారని తెలుస్తోంది. ఇక వీరు కూడా గంజాయి తీసుకున్నారంటూ ఫొటోలు పెట్టి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై నటి దివి వైద్య స్పందించింది. బర్త్ డే పార్టీకి పిలిస్తే వెళ్లాను కానీ, ఆ గంజాయి కేసులో తనకు సంబంధం లేదని చెప్పుకొచ్చింది. తన ఫోటోలను మీడియా నుంచి తీసివేయాలని కోరింది. 

 

Premalu 2: ఆగిపోయిన ప్రేమలు సీక్వెల్ .. ?

" మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఒక చిన్న రిక్వెస్ట్. ఫ్రెండ్ బర్త్ డే పార్టీ అని వెళితే.. అక్కడ ఏం జరుగుతుందో.. వాళ్లు ఏం తప్పు చేస్తున్నారో.. ఆ తప్పులను నాపై తోయడం కాదు కదా. నేను తప్పు చేశాను అని ప్రూఫ్స్ ఉంటే నా పేరు పెట్టినా బావుంటుంది. కానీ, ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా నా ఫోటోలు పెట్టి  నెగెటివ్ గా చేస్తే నా కెరీర్ కు ఎంత ఇబ్బంది అవుతుంది. చాలా కష్టపడి ఇక్కడవరకు వచ్చాను. ఫ్రెండ్ బర్త్ డే పార్టీ అంటే ఎవరైనా వెళ్తారు. ఫ్రెండ్ అంటే ఎవరో అనుకొని వెళ్లకుండా ఉండలేము. మంగ్లీ చాలా మంచి అమ్మాయి. నా ఫ్రెండ్ అని చెప్పి నేను వెళ్లాను. అక్కడ జరిగిన పరిస్థితికి నేను బాధితురాలిగా నా ఫోటోను పెట్టి నెగెటివ్ చేయడం తప్పు కదా. మీరు మీ ఫ్రెండ్స్ బర్త్ డేస్ కు వెళ్తారు. అక్కడ జరిగిన తప్పుకు మీరు బాధితులు అయిపోతారా.. ? అలా కాదుగా. దయచేసి నా ఫోటోలను తీసేయండి" అంటూ చెప్పుకొచ్చింది. 

Updated Date - Jun 11 , 2025 | 04:51 PM