Director Vassishta: విశ్వంభర స్టోరీ లీక్ చేసిన డైరెక్టర్.. కథేంటంటే
ABN, Publish Date - Jul 18 , 2025 | 04:05 PM
టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ ఎలాంటి హంగామా చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక హిట్ డైరెక్టర్ తో సినిమా అంటే ఆ రచ్చ అంతా ఇంతా కాదు.
Director Vassishta: టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ ఎలాంటి హంగామా చేస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక హిట్ డైరెక్టర్ తో సినిమా అంటే ఆ రచ్చ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం విశ్వంభర (Vishwambhara) సినిమాపై అభిమానులు ఓ రేంజ్ లో అంచనాలను పెట్టుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా హిట్ డైరెక్టర్ వశిష్ఠ (Director Vassishta) దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభర. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరు సరసన త్రిష నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఎప్పుడెప్పుడు విశ్వంభర రిలీజ్ అవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తూనే ఉన్నారు. కానీ, అదిగో అప్పుడు.. ఇదిగో ఇప్పుడు అని చెప్పడమే కానీ రిలీజ్ డేట్ ను మాత్రం ప్రకటించడం లేదు. ఇక తాజాగా డైరెక్టర్ వశిష్ఠ ఒక ఇంటర్వ్యూలో విశ్వంభర గురించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. అందులో విశ్వంభర కథను కూడా లీక్ చేశాడు. మొదటి నుంచి కూడా విశ్వంభర.. జగదేక వీరుడు అతిలోక సుందరి తరహాలో ఉంటుందని వార్తలు వచ్చాయి. ఈసారి వశిష్ఠ కూడా వార్తను కన్ఫర్మ్ చేసేశాడు.
' మనకు మొత్తం 14 లోకాలు ఉంటాయి. కింద 7 ఉండగా.. పైన 7 ఉంటాయి. స్వర్గం, పాతాళం, యమలోకం.. ఇలా వీటన్నింటికీ మెయిన్ లోకం సత్య లోకం.. అదే బ్రహ్మ లోకం. ఇప్పటివరకు చాలామంది డైరెక్టర్స్.. తమకు నచ్చిన పద్దతిలో నచ్చిన లోకాన్ని చూపించారు. నేను ఇప్పుడు సత్యలోకాన్ని చూపించబోతున్నాను. విశ్వం మొత్తాన్ని భరించేదే విశ్వంభర. అక్కడ ఉన్న హీరోయిన్ కోసం హీరో 14 లోకాలు దాటి వెళ్తాడు. ఆ సత్యలోకం నుంచి హీరోయిన్ ను హీరో ఎలా కిందకు తీసుకొచ్చాడు అనేది కథ' అని చెప్పుకొచ్చాడు.
విశ్వంభర కోసం ఇప్పటికే సత్యలోకం సెట్ ను వేశారట. ఎంతో భారీ బడ్జెట్ తో ఈ సెట్స్ ను నిర్మించారట. ఇదొక ఐ ఫీస్ట్ గా ఉంటుందని వశిష్ఠ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం వశిష్ఠ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో చిరు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.
Monica Song: ఏం సాంగ్ రా బాబు పోవడం లేదు మైండ్ లో నుంచి..
Anupama Parameswaran: స్టార్ హీరోయిన్స్ కే తప్పలేదు.. నువ్వెంత అనుపమ