Monica Song: ఏం సాంగ్ రా బాబు పోవడం లేదు మైండ్ లో నుంచి..

ABN , Publish Date - Jul 18 , 2025 | 02:20 PM

మోనికా.. మై డియర్ మోనికా.. లవ్ యూ మోనికా అంటూ ఒక సాంగ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ మధ్యకాలంలో ఓకే సాంగ్ హిట్ అయ్యింది అని ఎలా తెలుస్తోంది అంటే.. ఎక్కడ విన్నా.. ఎక్కడ చూసినా ఆ పాటనే వినిపించాలి..

Monica Song

Monica Song: మోనికా.. మై డియర్ మోనికా.. లవ్ యూ మోనికా అంటూ ఒక సాంగ్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ మధ్యకాలంలో ఓకే సాంగ్ హిట్ అయ్యింది అని ఎలా తెలుస్తోంది అంటే.. ఎక్కడ విన్నా.. ఎక్కడ చూసినా ఆ పాటనే వినిపించాలి.. ఆ సినిమా గురించే చర్చించాలి. అందులో డ్యాన్స్ చేసిన హీరోయిన్ గురించే ముచ్చటించాలి. హీరో గురించి తెలియకపోతే అసలు ఇంత బాగా డ్యాన్స్ చేశాడు ఎవర్రా ఈ హీరో అని ఆరాలు తీయాలి. అలా ఉంటేనే ఒక సాంగ్ హిట్ అయ్యిందని అర్ధం. ఇప్పుడు మోనికా సాంగ్ కు ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఈ సాంగ్ ఏ సినిమాలోది.. ? దాని కథాకమామీషు ఏంటో తెలుసుకుందాం రండి.


సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కూలీ. ఈ సినిమాలో రజినీతో పాటు అమీర్ ఖాన్, నాగార్జున, సౌబిన్ షాహిర్, సత్యరాజ్, ఉపేంద్ర ఇలా అన్ని ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ నటిస్తున్నారు. పాన్ ఇండియా మొత్తం ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో కూలీ కూడా ఒకటి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్, పవర్ హౌస్ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక సినిమా మొత్తాన్ని హైలైట్ గా మార్చేసింది మోనికా సాంగ్.


లోకేష్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చాలా తక్కువ. కానీ, కూలీ సినిమాలోని మోనికా సాంగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇండస్ట్రీలో హాట్ బ్యూటీస్ లో ఒకరిగా వెలుగొందుతున్న పూజా హెగ్డే.. ఈ సాంగ్ లో చిందేసింది. రెడ్ కలర్ లాంగ్ కట్ గౌన్ లో థైస్ ను ఎలివేట్ చేస్తూ.. అమ్మడి అందాల ఆరబోతకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అసలు పూజా ఎక్స్ ప్రెషన్స్, స్టెప్స్, ఆ అందాలు చూస్తుంటే రెండు కళ్లు చాలడం లేదని చెప్పుకొస్తున్నారు.


సాధారణంగా స్పెషల్ సాంగ్ అంటే అందరి చూపు హీరోయిన్ మీదనే ఉంటుంది. కానీ, ఈ సాంగ్ లో పూజా పాపనే డామినేట్ చేశాడు సౌబిన్ షాహిర్. మొదట మోనికా సాంగ్ ప్రోమోలో సౌబిన్ ను చూసిన వారందరూ.. అంతమంది స్టార్స్ ను పెట్టుకొని సౌబిన్ తో పూజా డ్యాన్స్ ఏంటి.. ? లోకేష్ కేం బుర్రా బుద్ధి లేదా అనుకున్నారు. కానీ, ఒక్కసారి ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యాకా.. అందరూ లోకేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు సౌబిన్ డ్యాన్స్ కు కుర్రకారు షాక్ అయిపోతున్నారు. ఆ ఎనర్జీ ఏంటి.. ? పూజాతో ఆ రొమాన్స్ ఏంటి.. ? ఆ స్టెప్స్ అయితే అబ్బబ్బా నెక్స్ట్ లెవెల్ అంతే.. కుర్ర హీరోలకు ధీటుగా సౌబిన్ డ్యాన్స్ అదరగొట్టేసాడు అని చెప్పుకొస్తున్నారు.


ఇక ప్రతి పాట వెనుక ఒక కారణం ఉంటుంది. హిట్ అయ్యాకనే దాని వెనుక ఉన్న స్టోరీ గురించి అందరూ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మోనికా అనే ఈ సాంగ్ వెనుక ఉన్న స్టోరీ గురించి లోకేష్ చెప్పుకొచ్చాడు. తనకు ఇటలీ నటి మోనికా బెల్లూచి అంటే చాలా ఇష్టమని, ఆమెపై అభిమానాన్ని తన సినిమాలో తెలుపడానికి మోనికా సాంగ్ ను పెట్టినట్లు చెప్పుకొచ్చాడు. ఇక పూజా, సౌబిన్ కన్నా ఎక్కువ ఈ సాంగ్ హిట్ అవ్వడానికి కారణం అనిరుధ్ రవిచంద్రన్. తన మ్యూజిక్ తో దేశం మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన అనిరుధ్ ఈసారి మోనికా అంటూ అందరి మతి పోగొట్టేశాడు. రిలీజ్ అయిన దగ్గరనుంచి మోనికా.. ఎవరి మైండ్ నుంచి పోవడం లేదు. ఏ షోలో చూసినా.. ఏ రీల్ చూసినా.. ఈ మీమ్ చూసినా.. మోనికా.. మై డియర్ మోనికా అంటూ ఊగిపోతున్నారు. మోనికా.. నువ్వు కేకా అంటూ చెప్పుకొస్తున్నారు.


కూలీ సినిమా మొత్తం ఒక ఎత్తు మోనికా సాంగ్ ఒక ఎత్తు. ఒకప్పుడు ఐటెంసాంగ్ కోసం మాత్రమే సినిమాలకు వెళ్లేవారట. ఇప్పుడు ఈ మోనికా సాంగ్ అప్పటి పరిస్థితిని రీక్రియేట్ చేసేలా ఉందని అంటున్నారు నెటిజన్స్. సినిమా కథ కనుక హిట్ అయితే సినిమాలో సాంగ్ చూస్తారు. లేదు అంటే సాంగ్ కోసం మాత్రమే సినిమా చూస్తారు. ఆగస్టు 14 న కూలీ రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమా అటు రజినీకి.. ఇటు నాగార్జునకి ఎలాంటి విజయాన్ని తీసుకొచ్చిపెడుతుందో చూడాలి.

Anupama Parameswaran: స్టార్ హీరోయిన్స్ కే తప్పలేదు.. నువ్వెంత అనుపమ

Junior Movie: జూనియర్ మూవీ రివ్యూ

Updated Date - Jul 18 , 2025 | 02:20 PM