Vishwambhara: రీమిక్స్ సాంగ్ లేదా.. అయ్యయ్యో ఎన్నో ఆశలు పెట్టుకున్నామే
ABN, Publish Date - Jul 17 , 2025 | 09:54 PM
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), త్రిష (Trisha) జంటగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభర(Vishwambhara).
Vishwambhara: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi), త్రిష (Trisha) జంటగా వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం విశ్వంభర(Vishwambhara). యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా తరహాలో విశ్వంభర తెరకెక్కుతోందని తెలియడంతో ఫ్యాన్స్ ఎప్ప్పుడెప్పుడు ఈ సినిమా రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన సినిమా విఎఫ్ఎక్స్ అవ్వలేదని ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉంటుంది.
ఇక ఇదంతా పక్కన పెడితే.. చిరు సినిమాలో ఐటెంసాంగ్ అంటే ఎంత రచ్చ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరు స్టెప్స్, అందాల భామ అందాలు.. థియేటర్ లో ఆ రెండింటిని చూడడానికి రెండు కళ్లు చాలవు. అందులోనూ ఎప్పటి నుంచోవిశ్వంభర కోసం చిరు సినిమాలోని ఒక సాంగ్ ను రీమిక్స్ చేస్తున్నారని వార్తలు రావడంతో.. మెగా ఫ్యాన్స్ అంచనాలు ఆకాశానికి తాకేశాయి. ఖైదీ నుంచి రగులుతోంది మొగలి పొద రీమిక్స్ అని కొందరు.. అన్నయ్య నుంచి ఆట కావాలా.. పాట కావాలా సాంగ్ రీమిక్స్ అని ఇంకొందరు చెప్పుకొచ్చి.. ఇక ఊరించారు. దీంతో ఫ్యాన్స్ అందరూ.. మాకు ఆ సాంగ్ కావాలి.. ఈ హీరోయిన్ కావాలి అని చెప్పుకొచ్చారు.
ఇక ఎట్టకేలకు రగులుతోంది మొగలిపొద ఖాయమని, ఈ సాంగ్ కోసం నాగిని భామ మౌనీ రాయ్ ను దింపుతున్నారని ఈమధ్యనే వార్తలు వినిపించాయి.త్వరలోనే ఈ సాంగ్ షూట్ కూడా మొదలుపెట్టనున్నారని చెప్పుకొచ్చారు. చిరు స్టెప్స్.. మౌనీ రాయ్ అందాలు.. అబ్బబ్బా ఏమైనా కాంబోనా బాసూ అనుకోని మురిసిపోయారు. అయితే తాజాగా డైరెక్టర్ వశిష్ఠ ఆ ఆశల మీద నీళ్లు పోసేశాడు. విశ్వంభరలో ఎలాంటి రీమిక్స్ సాంగ్ పెట్టడం లేదని చెప్పి ఆశలను అడియాశలు చేసాడు. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వశిష్ఠ.. చిరు సాంగ్ ను రీమిక్స్ చేయడం లేదని తేల్చి చెప్పాడు. ఇక దీంతో రీమిక్స్ సాంగ్ యేనా.. అసలు ఐటెంసాంగ్ కూడా లేదా.. ? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. రీమిక్స్ సాంగ్ కాకపోయినా మౌనీ రాయ్ తో ఐటెం సాంగ్ అయినా పెట్టమని వేడుకుంటున్నారు. మరి వశిష్ఠ.. అభిమానుల కోరికను మన్నిస్తాడో.. లేదో చూడాలి.
Nandamuri Balakrishna: స్క్విడ్ గేమ్ లో బాలయ్య.. ఏం ఫీల్ ఉంది మావా
Tollywood Heroines: రెండో పెళ్లికి మేము సిద్ధం..