Nandamuri Balakrishna: స్క్విడ్ గేమ్ లో బాలయ్య.. ఏం ఫీల్ ఉంది మావా
ABN , Publish Date - Jul 17 , 2025 | 09:15 PM
ఏఐ (AI) వచ్చాకా ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. అసలు ప్రపంచంలో అసలు జరగని వింతలను ఈ ఏఐ ద్వారా సృష్టిస్తున్నారు.
Nandamuri Balakrishna: ఏఐ (AI) వచ్చాకా ఏది నిజమో ఏది అబద్దమో తెలుసుకోవడం చాలా కష్టం అవుతుంది. అసలు ప్రపంచంలో అసలు జరగని వింతలను ఈ ఏఐ ద్వారా సృష్టిస్తున్నారు. హీరోలు లావయ్యినట్లు, ఫుడ్ ను దుస్తులుగా ధరిస్తే ఎలా ఉంటారు.. ? సామాన్యులుగా ఉంటే ఎలా జీవిస్తారు.. ? హీరోలు.. హీరోయిన్లుగా మారితే, హీరోయిన్లు.. హీరోలుగా పుట్టి ఉంటే.. ఇలా ఒకటి అని కాదు.. కొత్త కొత్త ఆలోచనలను చేస్తూ ఈ టెక్నాలజీ ఉపయోగించి సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.
స్క్విడ్ గేమ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ భారతీయులను ఏ రేంజ్ లో మెప్పించిందో అందరికీ తెల్సిందే. గుర్రాలపై వేసే పందేలను మనుషులపై వేసి.. డబ్బు ఆశ చూపించి.. వారిచేత చిన్నపిల్లల గేమ్స్ ఆడించి ఓడిపోయినవారిని చంపేస్తూ ఉంటారు. ఇప్పటివరకు మూడు సీజన్స్ రిలీజ్ అయ్యాయి. మొదటి సీన్ భారీ విజయాన్ని అందుకోగా రెండో సీజన్ యావరేజ్ గా నిలిచింది. ఈ మధ్యనే రిలీజ్ అయిన మూడో సీజన్ ప్లాప్ గా మిగిలింది. ఇలాంటి ఒక భయంకరమైన గేమ్ ను ఆపడానికి శాయశక్తులా ప్రయత్నించి హీరో చనిపోతాడు. ఈక్లైమాక్స్ తెలుగు ప్రేక్షకులకు నచ్చలేదు.
ఇక ఇదంతా పక్కన పెడితే.. ఇలాంటి ఒక సిరీస్ లో టాలీవుడ్ హీరోలు నటిస్తే ఎలా ఉంటుంది. ఇది ఎప్పటికీ నిజం కాకపోవచ్చు. కానీ, ఏఐ లో సాధ్యం కానిది ఏముంది. అందుకే చాలామంది స్క్విడ్ గేమ్ లో టాలీవుడ్ హీరోలు నటిస్తే ఇలానే ఉంటుంది అనేవిధంగా అందరి హీరోలను ఒక్కో పాత్రలో చూపించారు. అప్పట్లో ఈ వీడియో సెన్సేషన్ సృష్టించింది. ఇక తాజాగా అఖండ 2 టీజర్ స్పూఫ్ తో స్క్విడ్ గేమ్ ను డిజైన్ చేశారు. స్క్విడ్ గేమ్ లో నందమూరి బాలకృష్ణ పాల్గొంటే ఏంటి పరిస్థితి అనేది ఈ వీడియో థీమ్ అన్నమాట.
అనసూయ, రాజీవ్ కనకాలతో పాటు హీరోగా నందమూరి బాలకృష్ణ స్క్విడ్ గేమ్ ఆడడానికి వెళ్లారు. ది మ్యాన్ విత్ అంబ్రెల్లా అనే ఎపిసోడ్ లో ఒక గేమ్ ఉంటుంది. బెల్లంతో తయారుచేసిన ఒక స్వీట్ లోపల సర్కిల్, స్టార్, అంబ్రెల్లా షేప్స్ ఉంటాయి. వాటిని కరెక్ట్ గా కట్ చేసి చూపించాలి. కొంచెం పక్కకు జరిగినా మరణం తధ్యం. ఇక ఈ వీడియోలో కూడా బాలయ్య, రాజీవ్ కనకాల, అనసూయ ఆ షేప్స్ ను కట్ చేయడం చూపించారు. అనసూయ కరెక్ట్ గా కట్ చేయడం ఆమె సేవ్ అవుతుంది. రాజీవ్ కనకాల ఓడిపోవడంతో అతడిని చంపేస్తారు.
హీరో అయిన బాలయ్య కోపం గురించి తెల్సిందే కదా. ఓపిక లేక ఆ స్వీట్ ను మొత్తం తినేస్తాడు. దీంతో అతనిని చంపడానికి గేమ్ నిర్వాహకులు వస్తుంటే.. అఖండ 2 టీజర్ లోత్రిశూలం తిప్పుతూ వారందరినీ మట్టి కరిపించినట్టే.. ఇక్కడ ఒకా రాడ్ ను తిప్పుతూ వారందరినీ చంపేశాడు. వారి గన్ తోనే అందరినీ పైకి లేపి కిందపడేశాడు. ఇది బాలయ్య స్క్విడ్ గేమ్. జై బాలయ్య అని చివర్లో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారాయి. ఈ వీడియో చూసిన అభిమానులు బాలయ్య ఎక్కడైనా దబిడిదిబిడే.. ఈ వీడియో చూస్తుంటే ఏం ఫీల్ ఉంది మావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.