సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sujeeth: సచిన్ తో సుజిత్.. ఫ్రేమ్ అదిరిపోయిందిగా

ABN, Publish Date - Nov 07 , 2025 | 04:16 PM

కుర్ర డైరెక్టర్ సుజీత్ (Sujeeth) ఈ ఏడాది ఓజీ (OG) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్ లోనే భారీ వసూళ్లను అందించిన డైరెక్టర్ గా సుజీత్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చింది.

Sujeeth

Sujeeth: కుర్ర డైరెక్టర్ సుజీత్ (Sujeeth) ఈ ఏడాది ఓజీ (OG) సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకున్నాడు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కెరీర్ లోనే భారీ వసూళ్లను అందించిన డైరెక్టర్ గా సుజీత్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ వచ్చింది. నిజం చెప్పాలంటే పవన్ అభిమానిగా సుజీత్ తనను తాను నిరూపించుకున్నాడు. ఇక ఓజీ తరువాత ఈ కుర్ర డైరెక్టర్ .. నానితో ఒక సినిమా చేస్తున్నాడు. నాని ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ది ప్యారడైజ్ చేస్తున్నాడు. ఈ సినిమా ఫినిష్ అయ్యాక సుజీత్ సినిమా పట్టాలెక్కుతోంది.

ఈలోపు ఖాళీగా ఉండకుండా సుజీత్ యాడ్ షూట్స్ చేస్తున్నాడు. అందులో భాగంగానే ఒక యాడ్ షూట్ కోసం ఏకంగా క్రికెటర్ సచిన్ టెండూల్కర్ తోనే చేతులు కలిపాడు. ఎప్పటి నుంచో సచిన్ యాడ్ ను డైరెక్ట్ చేయబోతుంది సుజీత్ అని వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. తాజాగా ఈ యాడ్ షూట్ జరిగినట్లు తెలుస్తోంది. షూట్ లో సచిన్ కి సీన్ వివరిస్తున్న ఫోటోలను సుజీత్ తన సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాకుండా క్యూట్ క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో అద్భుతమైన క్షణాలు అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఫోటోలను చూసిన అభిమానులు ఫ్రేమ్ అదిరిపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. త్వరలోనే ఈ యాడ్ రిలీజ్ కానుంది.

Pongal Movies: రాజా సాబ్ సీన్ ఎలా ఉండబోతోంది...

Gouri G Kishan: నీ బరువెంత.. హీరోలను అడుగుతారా.. జర్నలిస్ట్ పై హీరోయిన్ ఫైర్

Updated Date - Nov 07 , 2025 | 04:17 PM