సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Raju Weds Rambai: నెగెటివ్‌ టాక్‌ వస్తే.. అమీర్‌పేట సెంటర్‌లో కట్ డ్రాయర్ మీద తిరుగుతా

ABN, Publish Date - Nov 20 , 2025 | 12:52 PM

‘రాజు వెడ్స్ రాంబాయి’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో డైరెక్టర్ సాయిలు భావోద్వేగంగా మాట్లాడారు. 15 ఏళ్ల నిజజీవిత కథ ఆధారంగా చేసిన ఈ సినిమాకు నెగిటివ్ ప్రచారం చేయొద్దని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు.

Raju Weds Rambai

అఖిల్ రాజ్ (Akhil Raj), తేజస్విని (Tejaswini) జంటగా నటించిన ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai) సినిమా నవంబర్ 21న ప్రేక్షకులకు రానుంది. వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ చిత్రానికి సాయిలు కంపాటి దర్శకత్వం వహించారు. వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ ద్వారా రిలీజ్ చేస్తున్నారు. కాగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు సాయిలు కంపాటి (Saailu Kampati) భావోద్వేగంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా సాయిలు మాట్లాడుతూ.. “రాజు వెడ్స్ రాంబాయి కోసం మా టీమ్ ఎంతో కష్టపడి పనిచేసింది. సినిమాటోగ్రాఫర్ వాజిద్ అందమైన విజువల్స్ తీశాడు. ఎడిటర్ నరేష్ ప్రేమను అందంగా కట్ చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి నిజంగా టాలెంటెడ్. ‘విరాటపర్వం’ బీజీఎమ్ విని నాకు కన్నీళ్లు వచ్చాయి. ఆయన స్కోర్ ఈ సినిమాకూ పెద్ద బలం అవుతుంది” అని ప్రశంసించారు. “నేను ఊరు మనిషిని.. నాకు తెలిసింది ఊరి జీవితం, మట్టి మనుషులు, పొలాలలో పనిచేసే వారు, అమాయక ఆటో డ్రైవర్లు, కాలేజీకి వెళ్లే అమ్మాయిల మధ్య పుడే పచ్చి ప్రేమ. హెలికాప్టర్లలో దిగే హీరో కథలు నాకు రాయడం రాదు. నా ఒరిజినాలిటీ గ్రామ జీవితం. అదే నేను రాస్తా.. అదే తీస్తా అన్నారు.

ఇంకా ఆయ‌న మాట్లాడుతూ.. “ఈ సినిమా చిన్నదైనా భారీ ఎమోషన్ ఉంది. 15 ఏళ్లపాటు నరకం అనుభవించిన ఒక జంట కథను బయటకు తీసుకురావాలనుకున్నా. ఎవ్వరినీ హర్ట్ చేసే ఉద్దేశం లేదు. మీకు నచ్చకపోతే పర్లేదు… కానీ దయచేసి నెగిటివ్ ప్రచారం మాత్రం చేయకండి” అని భావోద్వేగంగా చెప్పారు. 21న సినిమా మీద నెగిటివ్ టాక్ వస్తే… అమీర్‌పేట సెంటర్‌లో కట్ డ్రాయర్ మీద తిరుగుతా. అంత నమ్మకంతో చెప్తున్నా. మా కష్టం ఫలితం తప్పకుండా ఇస్తుంది” అని అన్నారు.

Updated Date - Nov 20 , 2025 | 01:11 PM