Krish Jagarlamudi: స్వీటీపై మాట పడకుండా బాగానే కవర్ చేశాడే
ABN, Publish Date - Aug 31 , 2025 | 10:29 PM
ఒక ప్రొడెక్ట్ ను ఎంత ఖర్చు పెట్టి తయారుచేశామన్నది ముఖ్యంగా కాదు.. ఆ ప్రొడెక్ట్ ని జనాల్లోకి ఎంతవరకు తీసుకెళ్ళమన్నది ముఖ్యం. అదే మార్కెటింగ్ స్ట్రాటజీ.
Krish Jagarlamudi: ఒక ప్రొడెక్ట్ ను ఎంత ఖర్చు పెట్టి తయారుచేశామన్నది ముఖ్యంగా కాదు.. ఆ ప్రొడెక్ట్ ని జనాల్లోకి ఎంతవరకు తీసుకెళ్ళమన్నది ముఖ్యం. అదే మార్కెటింగ్ స్ట్రాటజీ. ప్రస్తుతం చిత్ర పరిశ్రమ కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది. సినిమా ఎన్ని కోట్లు పెట్టి తీసామన్నది కాదు. ఆ సినిమాను జనాల్లోకి ఎంత వరకు తీసుకెళ్ళమన్నది ముఖ్యం. దానికోసమే ఎక్కువ ఖర్చు పెడుతున్నారు మేకర్స్. కొన్ని సినిమాలు ప్రమోషన్స్ లేకనే మంచి విజయాన్ని అందుకోలేకపోయాయి అన్నది వాస్తవం. సరే ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే.. ఏ సినిమాకు అయినా హైలెట్ హీరోహీరోయిన్. వారిద్దరూ కనిపిస్తేనే ప్రేక్షకులు సినిమా వైపు తొంగిచూస్తారు. కానీ, లేడీ ఓరియెంటెడ్ సినిమా ప్రమోషన్స్ కు హీరోయినే రాకాపోతే ఎలా.. ? ఆ హీరోయిన్ ఎవరు.. సినిమా ఏంటి.. ? అనేది ఈ పాటికీ అర్దమైపోయే ఉంటుంది. అవును.. ఆ సినిమా ఘాటీ(Ghaati).. ఆ హీరోయిన్ అనుష్క శెట్టి (Anushka Shetty).
అనుష్క ప్రధానపాత్రలో క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన చిత్రం ఘాటీ. ఎన్నో వాయిదాల తరువాత ఈ సినిమా సెప్టెంబర్ 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్ హీరో విక్రమ్ ప్రభు కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్, ట్రైలర్ సినిమాపై మంచి హైప్ నే ఇచ్చింది. ఇక స్వీటీ అభిమానులు.. ఎప్పుడెప్పుడు ఆమె ప్రమోషన్స్ లో కనిపిస్తుందా అని వెయ్యి కళ్ళతో ఎదురుచూసారు. కానీ, ఆ వారి ఆశలను నిరాశ చేస్తూ.. అనుష్క ప్రమోషన్స్ కు రావడం లేదు.. ఆమె ముందే చెప్పింది. అది ఒప్పుకున్నాకే సినిమా మొదలుపెట్టామని నిర్మాత రాజీవ్ రెడ్డి నిర్మొహమాటంగా చెప్పుకొచ్చాడు.
ఇక నిర్మాత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆమె సినిమాకు ఆమె రాకపోవడం ఏంటి.. ? స్వీటీ రాకపోవడానికి కారణం ఏంటి.. ? అని చాలామంది విమర్శలు గుప్పించారు. స్వీటీ ప్రమోషన్స్ కు రాకపోవడం పెద్ద మైనస్ అని, ఆమె కోసమే ఈ సినిమాను చూసేవాళ్ళు ఉన్నారని, ప్రమోషన్స్ లో ఆమె లేకపోతే కష్టమని చెప్పుకొచ్చారు. కనీసంలో కనీసం ఒక్క ఈవెంట్ లో కూడా స్వీటీ కనిపించకపోతే ఎలా అని ప్రశ్నించారు. అంతేకాకుండా స్వీటీ బరువు వలనే ఇదంతా చేస్తున్నారని కూడా చెప్పుకొచ్చారు. ఇక తాజాగా ఈ విమర్శలపై క్రిష్ స్పందించాడు. స్వీటీపై ఎలాంటి మాటపడకుండా కవర్ చేశాడు.
తాజాగా ప్రమోషన్స్ లో పాల్గొన్న క్రిష్.. అనుష్క ప్రమోషన్స్ కు ఎందుకు రావడం లేదు అన్న ప్రశ్నకు అది ఆమె వ్యక్తిగతం.. ఆమె నిర్ణయాన్ని మేము గౌరవించాలని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా స్వీటీ లేకపోవడం ప్రమోషన్స్ లో ఇబ్బందికరంగా లేదా అన్న ప్రశ్నకు..మాకు అనుష్క పెర్ఫార్మెన్స్ చాలు.. ప్రమోషన్స్ అవసరం లేదు అని చెప్పుకొచ్చాడు. దీంతో స్వీటీని బాగానే కవర్ చేశాడు కానీ.. ప్రమోషన్స్ లో హైప్ రాకపోతేనే ఇబ్బంది పడాలి అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మొదటినుంచి క్రిష్, రాజీవ్ రెడ్డి ఘాటీ ప్రమోషన్స్ మొదలుపెట్టారు.. మధ్యలో విక్రమ్ ప్రభు యాడ్ అయ్యాడు. ఎంతమంది వచ్చినా స్వీటీ ఉన్న తీరు వేరు అనేది అభిమానుల అభిప్రాయం. మరి క్రిష్ కాన్ఫిడెన్స్ తో .. స్వీటీ లేకపోయినా ఈ ప్రమోషన్స్ మంచిగా చేసి ఘాటీని గట్టెక్కిస్తాడా.. ? లేదా.. ? అనేది చూడాలి.
Ram Charan: సీఎంను కలిసిన రామ్ చరణ్.. ఫోటోలు వైరల్
Tribanadhari Barbarik: మనస్తాపానికి గురై చెప్పుతో కొట్టుకున్న దర్శకుడు..