Bakasura Restaurant OTT: సైలైంట్‌గా.. ఓటీటీకి బ‌కాసుర రెస్టారెంట్‌

ABN , Publish Date - Sep 07 , 2025 | 03:04 PM

ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ప్ర‌వీణ్ (Praveen) లీడ్ రోల్‌లో న‌టించిన చిత్రం బ‌కాసుర రెస్టారెంట్.

Bakasura Restaurant

ప్ర‌ముఖ క‌మెడియ‌న్ ప్ర‌వీణ్ (Praveen) లీడ్ రోల్‌లో న‌టించిన చిత్రం బ‌కాసుర రెస్టారెంట్ (Bakasura Restaurant). హ‌ర్ర‌ర్ కామెడీ జాన‌ర‌ల్‌లో రూపొందిన ఈ చిత్రం గ‌త నెల‌లో థియేట‌ర్ల‌కు వ‌చ్చి ఫ‌ర్వాలేద‌ని అనిపించుకుంది. ఎస్‌.జే‌. శివ (SJ Shiva) దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వైవా హర్ష (Viva Harsha), శ్రీకాంత్ అయ్యంగార్ (Srikanth Iyengar), కృష్ణ భ‌గ‌వాన్‌, ముఖ్య పాత్రలో న‌టించారు. ఇప్పుడీ సినిమా అంత‌గా చ‌ప్పుడు లేకుండా సైలెంట్‌గా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు వ‌చ్చేస్తుంది.

కథ ఏంటంటే: సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న పరమేశ్‌ (ప్రవీణ్‌) కి సొంతంగా రెస్టారెంట్ ప్రారంభించి, మంచి ఆహారం అందించాలని కలలు కంటాడు. అందుకోసం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా స‌ఫ‌లం కావు. మ‌రోవైపు త‌న‌తో పాటు ఉండే మ‌రో న‌లుగురు మిత్రులు కూడా క‌లిసి ఘోష్ట్ హంటింగ్ వీడియోలు తీసి యూ ట్యూబ్ ద్వారా డ‌బ్బు సంపాదించి ఇపై రెస్టారెంట్ పెట్టాల‌ని డిసైడ్ అవుతారు. ఈ క్ర‌మంలో ఓ పాడుబ‌డ్డ భ‌వ‌నం ద‌గ్గ‌రికి వెళ్లిన వారికి అక్క‌డో పుస్త‌కం ల‌భిస్తుంది. ఆ పుస్త‌కం ప్ర‌కారం ప్ర‌యోగాలు చేస్తుండ‌గా అనుకోకుండా బ‌క్క సూరి ఆత్మ బ‌య‌ట‌క‌ వ‌స్తుంది. ప‌ర‌మేశ్ బంధువు అంజిని ఆవ‌హిస్తుంది. ఈ నేప‌థ్యంలో ఎలాంటి ప‌రిణామాలు జ‌రిగాయి, ప‌ర‌మేశ్ క‌ల నెర‌వేరిందా లేదా అన్న‌ది మిగతా కథ.

Bakasura Restaurant

దర్శకుడు ఎంచుకున్న కథ ఆకర్షణీయమైనదే అయినా, అక్క‌డ‌క్క‌డ నిదారంగా సాగుతుంటుంది ఆత్మ శరీరంలోకి ప్రవేశించడం, అక్కడి నుంచి జరిగే సరదా సంఘటనలు కొత్తగా అనిపించినాత‌ర్వాత జ‌ర‌గ‌బోయేది ప్రేక్షకుడు ఊహించేలా ఉంది. వైవా హర్ష పాత్ర ప్రవేశించడంతో నవ్వులు మొదలవుతాయి. అతని ఫ్లాష్‌బ్యాక్ సైతం భావోద్వేగంగా తాకుతుంది. ఇప్పుడీ సినిమా సోమ‌వారం నుంచి అమెజాన్ ప్రైమ్ (Prime Video) ఓటీటీలో స్ట్రీమింగ్ అవ‌నుంది. సెప్టెంబ‌ర్ 12 నుంచి స‌న్ నెక్ట్స్ (Sun NXT) లోనూ అందుబాలుటోకి రానుంది. థియేట‌ర్‌లో మిస్స‌యిన వారు, హారర్ కామెడీని కొత్తగా ప్రయత్నించాలని భావించే ప్రేక్షకులకు ఈ బ‌కాసుర రెస్టారెంట్ (Bakasura Restaurant) చిత్రం తప్పక న‌చ్చుతుంది.

Updated Date - Sep 07 , 2025 | 03:04 PM